Astrology: కుంభరాశిలో సూర్యుడు-శని అశుభ సంయోగం.. ఈ ఐదు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..

|

Feb 16, 2023 | 7:00 AM

ఫిబ్రవరి 13 నుండి కుంభరాశిలో సూర్యుడు, శని సంయోగం జరుగనుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు దానిని సంయోగం అంటారు. గత నెల 17 నుంచి కుంభరాశిలో శని..

Astrology: కుంభరాశిలో సూర్యుడు-శని అశుభ సంయోగం.. ఈ ఐదు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..
Follow us on

ఫిబ్రవరి 13 నుండి కుంభరాశిలో సూర్యుడు, శని సంయోగం జరుగనుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు దానిని సంయోగం అంటారు. గత నెల 17 నుంచి కుంభరాశిలో శని సంచరిస్తుండగా.. ఏడాది పొడవునా ఈ రాశిలో కొనసాగుతాడు. ఇక సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు. కుంభం శని గ్రహం సొంత రాశి. అయితే, సూర్యుడు, శని శత్రు భావాన్ని కలిగి ఉంటారు. కుంభరాశిలో సూర్యుడు-శని కలిసి రావడం వల్ల అనేక రాశులతో పాటు దేశంపైనా, ప్రపంచంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు జ్యోతిష్య పండితులు.

మార్చి 15 న సూర్యుడు, శని అశుభ కలయిక ఉంటుంది. దీని కారణంగా దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. సూర్యుడు-శని గ్రహాల అశుభ కలయిక.. పలువురి జాతకాలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు.

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

కుంభం శని భగవానుడి స్వంత రాశి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడు, శని మధ్య అస్సలు పొసగదు. అటువంటి పరిస్థితిలో, కుంభరాశిలో సూర్యుడు-శని కలయిక ఉన్నంత కాలం.. కొన్ని రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సూర్యుడు-శని సంయోగం వల్ల.. కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, కుంభ రాశి వారిపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

చాలా నష్టం..

శని, సూర్యుడి సంయోగం వల్ల ఈ 5 రాశుల వారికి ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ అపజయమే ఉంటుంది. ప్రతికూలత మనస్సులో ఆధిపత్యం చెలాయిస్తుంది. అవనవసర వాదోపవాదాలు జరుగుతాయి. చట్టపరమైన వివాదాలకు ఎక్కువ సమయం పడుతుంది. ఉద్యోగులకు కూడా గడ్డు పరిస్థితిలే ఉంటాయి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. ప్రేమ సంబంధాల్లో బీటలు ఏర్పడుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..