Astrology: కొత్త సంవత్సరం తొలి రోజును ఇలా ప్రారంభించండి.. లక్ష్మీ దేవి కృపతో డబ్బులే డబ్బులు..

|

Dec 31, 2022 | 10:12 PM

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరూ రాబోయే సంవత్సరం గత ఏడాది కంటే మెరుగ్గా ఉండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటారు.

Astrology: కొత్త సంవత్సరం తొలి రోజును ఇలా ప్రారంభించండి.. లక్ష్మీ దేవి కృపతో డబ్బులే డబ్బులు..
Laxmi Devi
Follow us on

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరూ రాబోయే సంవత్సరం గత ఏడాది కంటే మెరుగ్గా ఉండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. కొత్త సంవత్సంర తొలి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేస్తే సిరిసంపదలు కలిగించే లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందవచ్చు. అమ్మవారి ఆశీస్సులతో కుటుంబంలో, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం, ఆనందం వెల్లివిరుస్తాయి.

కొత్త సంవత్సరాన్ని ఎలా ప్రారంభించండి..

1. అందరి జీవితాల్లో చీకట్లను తొలగించే భగవానుడిగా సూర్యదేవుడు ప్రసిద్ధి. నూతన సంవత్సరం తొలి రోజు ఆదివారంతో ప్రారంభం అవుతుంది. తొలి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, ఎర్రని దస్తులు ధరించి, రాగి పాత్రలో గంగా జలం తీసుకుని సూర్య భగవానుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన అదృష్టం వరిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి.. విజయం వరిస్తుంది.

2. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం.. సంవత్సరంలో మొదటి రోజున ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక లేదా గుర్రపు డెక్క గుర్తును వేయాలి. అది కాకుండా.. రాగి సూర్యుడిని కూడా ప్రధాన ద్వారంపై వేలాడదీయొచ్చు. దీని వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు విలసిల్లుతాయి. ఇంట్లో సంపద ఎప్పుడూ ఉంటుంది. ఇవి కాకుండా.. ఇంటి మెయిన్ డోర్‌పై లక్ష్మీ దేవి పాదముద్రలను కూడా ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి

3. సంవత్సరం పొడవునా మంచి ఆదాయం ఉండాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా.. జనవరి 1వ తేదీన పేదలకు, నిస్సహాయులకు, రుత్విక్కులకు, వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. దీంతో అన్నపూర్ణ దేవి అనుగ్రహం లభిస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో లాఫింగ్ బుద్ద, నెమలి ఈకలు, లక్ష్మీ-కుబేరుడి యంత్రం, వెండి ఏనుగును ఇంట్లోకి తీసుకురావడం వల్ల మీ అదృష్టం మరింత పెరుగుతుంది. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..