Mental Stress Remedy: ప్రస్తుత ఉరుకులు, పరుగుల ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూనే ఉంటున్నారు. ఆస్తులు, ఆనందం కోసం పరుగెడుతూ మనశ్శాంతిని కోల్పోతున్నారు. లేని వాటిని పొందడానికి ప్రయత్నిస్తూ.. ఉన్నవాటిని కోల్పోతున్నారు. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతలు, చిరాకలు, పరాకులు, విభేదాలు, మానసిక ఆందోళనతో సతమతం అవుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలకు స్వీయ తప్పిదాలు ఒక కారణమైతే.. ఇంట్లోని వాస్తు దోషాలు మరొక కారణం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వాస్తు దోషాలను సరి చేస్తే.. జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు. మరి ఆ వాస్తు దోషాలేంటి? వేటిని తొలగించాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
1. వాస్తు ప్రకారం, ఇంటి గోడల సగటు ఎత్తు 10 అడుగులు ఉంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి గోడ ఎత్తు ఎనిమిదిన్నర అడుగులు మాత్రమే ఉంటే, అలాంటి ఇంట్లో మానసిక ఉద్రిక్తత, ఆందోళనలు తరచుగా ఉంటాయి.
2. వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ పాడైపోయిన విద్యుత్ పరికరాలు ఉంచొద్దు. ఇలాంటి వస్తులు స్తబ్దతను సూచిస్తాయి. ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. ఫలితంగా ఇంట్లో ఘర్షణలు, మానసిక ఆందోళనలు కలుగుతాయి.
3. మానసిక ఒత్తిడిని పెంచే వస్తువులను వేటీని బెడ్‌రూమ్‌లో ఉంచొద్దు. ఉదాహరణకు.. బరువైన వస్తువులను పడకగదిలో మంచం కింద, దగ్గర అస్సు ఉంచకూడదు. అలాగే బెడ్‌రూమ్‌లో టీవీ, మ్యూజిక్ సెట్ పెట్టకూడదు.
4. ఇల్లు కట్టేటప్పుడు రెండు తలుపులు ఎప్పుడూ పక్కపక్కన ఉండకూడదు. అలాగే తలుపు పైన మరో తలుపు ఉండకూడదు. ఇలాంటి వాస్తు దోషం కారణంగా ఇంట్లో చిరాకులు వస్తాయి.
5. పడకగదిలో అద్దం పెట్టకూడదు. ఒకవేళ అద్దం బెడ్‌రూమ్‌లో ఉన్నట్లయితే.. ఉపయోగించిన తర్వాత దాన్ని క్లాత్‌తో కవర్ చేయండి. అదేవిధంగా, మీ గదిలో టీవీ సెట్ ఉంటే దానిని కూడా క్లాత్‌తో కప్పండి, ఎందుకంటే వాటి స్క్రీన్‌పై మీ బెడ్ ప్రతిబింబం కనిపిస్తుంది. వాస్తు ప్రకారం పెద్ద దోషంగా పరిగణిస్తారు.
6. వాస్తు ప్రకారం, ఇంటి ఈశాన్య మూలలో బావి, బోర్, వాటర్ ట్యాంక్ నిర్మించొద్దు. అలా చేస్తే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇంటి యజమాని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)
Also read:
Pushpa: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్.. రైల్వే శాఖ కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా..
Viral Video: వామ్మో.. ఇదేం టాలెంట్ రా బాబు.. ఊ అంటావా పాటను ఇలా చేశారేంటీ..