Astro Tips: భారతదేశం సనాతన ధర్మంలో కొబ్బరికాయకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. హిందూమత ఆచార, వ్యవహారాల్లో కొబ్బరికాయ ఒక భాగం. ఈ కొబ్బరికాయ లేనిది ఏ కార్యక్రమం ఉండదని చెప్పొచ్చు. దేవతా మూర్తులను కొబ్బరి కాయతో పూజించడం ద్వారా వారి ఆశీస్సులు పొందవచ్చునని విశ్వాసం. అందుకే భక్తులు దేవాలయాల్లో, ఇళ్లలోనూ దేవుళ్ల ముందు కొబ్బరికాయను కొడుతారు. ఆ నీటితో దేవతామూర్తులకు అభిషేకం కూడా చేస్తారు. అంతేకాదు.. ఏ కార్యం ప్రారంభించినా దానికి ముందు కొబ్బరికాయ కొట్టడం శుభప్రదంగా భావిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ ద్వారా వ్యక్తి జీవితంలోని అనేక సమస్యలను తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. జీవితంలోని ప్రతికూల పరిస్థితులను తొలగిస్తాయట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరియ వలన వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది..
ఇల్లు, కుటుంబ సభ్యులపై చెడు దృష్టి పడటం వల్ల ఇంటిపై, ఇంట్లోని వ్యక్తుల జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు, వివాదాలు తలెత్తుతాయి. కొన్నిసార్లు సంబంధాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రతికూలతను తొలగించడానికి కొబ్బరికాయ ఉపకరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయను బాధిత వ్యక్తి మీద నుంచి 11 సార్లు తిప్పాలి. ఆ తరువాత కొబ్బరికాయను కాల్చి, దాని బూడిదను నీటిలో కలిపేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి.
వ్యాధులు మాయం..
ఇంట్లోని వ్యక్తి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లయితే.. కొబ్బరికాయతో వాస్తు నివారణ చర్యలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను చుట్టి.. దానిని రోగి శరీరంపై నుంచి 7సార్లు తిప్పాలి. ఆ తరువాత ఆ కొబ్బరికాయను హనుమంతుని పాదాల చెంత పెట్టాలి. ఇలా చేయడం ద్వారా బాధిత వ్యక్తి త్వరగా కోలుకుంటాడని విశ్వాసం.
ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం..
చాలామంది కష్టపడి, అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. దీనికి వాస్తు దోషాలే కారణం అని చెబుతున్నారు వాస్తు పండితులు. వాస్తు దోషాల కారణంగా లక్ష్మీ ఆగ్రహానికి గురై.. వారి నుంచి వెళ్లిపోతుందట. ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు గురువారం నాడు లక్ష్మీ దేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఆ రోజున.. పసుపు క్లాత్ తీసుకుని అందులో కొబ్బరికాయ కట్టాలి. ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవి పాదల చెంత ఉంచాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి, విష్ణువు కూడా ప్రసన్నమై.. ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారని చెబుతున్నారు.
(గమనిక: ఇది మతవిశ్వసాలు, మత గ్రంధాల ఆధారంగా పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించలేదు.)
Also read:
LIC Plans: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. రోజూ రూ.29 సేవ్ చేస్తే రూ. 4 లక్షలు పొందవచ్చు..!
Andhra Pradesh: ఎన్టీఆర్ వారసులు ఎవరు?.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం..
Puzzle Challenge: ఇది కదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫజిల్‌ను చేజ్ చేస్తే మీకన్నా జీనియస్ లేనట్లే!