వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిలో సుఖ సంతోషాలు ఉండాలంటే ఎటువంటి వాస్తు దోషం ఉండకూడదు. ఎటువంటి వాస్తుదోషం లేని గృహాలు ఎల్లప్పుడూ ఆనందం, సానుకూల శక్తి, ఆనందం మరియు శాంతిని కలిగి ఉంటాయి. అయితే వాస్తుకి విరుద్ధంగా.. వాస్తుదోషం లేదా ఏదైనా వస్తువులను తప్పు దిశలో ఇంట్లో ఉంచినట్లు అయితే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రతికూల శక్తి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. వాస్తు దోషం కారణంగా ఒక వ్యక్తి మనస్సులో ప్రతికూల భావన తలెత్తుతుంది. అంతేకాదు ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు తరచుగా అనారోగ్యానికి గురవుతారు.
విరిగిన విగ్రహం
హిందూ మతంలో విగ్రహారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం, ఒక ఇంట్లో విరిగిన దేవతా విగ్రహం లేదా చిరిగిపోయిన దేవుడి చిత్ర పఠాలు లేదా దెబ్బతిన్న బొమ్మ ఉంటే.. వెంటనే వీటిని ఇంటి నుంచి తొలిగించండి. వీటి ఇంటి బయట పవిత్ర స్థలంలో ఉంచండి. హిందూ మతంలో.. విరిగిన లేదా పగిలిన విగ్రహాన్ని పూజించడం మంచిది కాదు. వాస్తు ప్రకారం, విరిగిన విగ్రహాలను పూజించడం నిషేధించబడింది. ఇలా చేయడం వలన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో విరిగిన విగ్రహం లేదా బొమ్మ ఉంటే నదిలో నిమజ్జనం చేయాలి.
విరిగిన వస్తువులు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పనికిరాని లేదా విరిగిపోయిన వస్తువులలో ప్రతికూల శక్తి చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, పనికిరాని వస్తువులను వెంటనే ఇంట్లో నుండి తొలగించాలి. పగిలిన వస్తువులను చాలా రోజుల పాటు నిరంతరం వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలంటి ఇంట్లో నివసించే సభ్యులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ముళ్ల మొక్కలు
వాస్తు ప్రకారం, పచ్చని మొక్కలను ఇళ్లలో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రభావం ఉంటుంది. కానీ ఇంటి లోపల ఎప్పుడైనా ఎండిపోయిన మొక్కలు లేదా చాలా ముళ్ళు ఉన్న మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. దీంతో ఇంట్లో టెన్షన్, రోగాలు వస్తుంటాయి.
ప్రధాన ద్వారం ముందు పూజ గది
చాలా ఇళ్లలో పూజ గది ప్రధాన ద్వారం నేరుగా ఉన్న చోట ఏర్పాటు చేసుకోవడం తరచుగా కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు గుడి ఉండకూడదు. దీని కారణంగా ఆ వ్యక్తి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి ప్రదేశంలోని పూజ గదిలో పూజ చేసినా ఆ పూజలకు తగిన పూర్తి ఫలం లభించదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)