Ashada Masam: ఈ ఏడాది ఆషాడ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? శూన్య మాసం, అనారోగ్య మాసం అని ఎందుకు అంటారో తెలుసా..!

|

Jun 18, 2024 | 6:05 PM

వర్ష ఋతువు ఆషాడ మాసం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకం అని.. చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం.

Ashada Masam: ఈ ఏడాది ఆషాడ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? శూన్య మాసం, అనారోగ్య మాసం అని ఎందుకు అంటారో తెలుసా..!
Ashada Masam
Follow us on

తెలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల ఆషాడ మాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలతో ఉన్న నేలను ఆషాడ మాసం అని అంటారు. ఈ మాసాన్ని శూన్య మాసం. వర్ష ఋతువు ఆషాడ మాసం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకం అని.. చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం. ఈ ఏడాది ఆషాడ మాసం జూలై 6 వ తేదీన ప్రారంభమై.. ఆగష్టు 4 వ తేదీన ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ ఆషాడ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం..

  1. ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు.. అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.
  2. ఆషాడ శుద్ద విదియ రోజున పూరీ జగన్నాదుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుగుతుంది.
  3. ఆషాడ సప్తమిని భాను సప్తమి అంటారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానంగా ఉంటాయి.
  4. ఆషాఢ శుద్ధ ఏకాదశి తిధిన విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెలల్లోని ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది.
  5. ఆషాడ మాసంలోనే తెలంగాణాలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు.
  6. ఆషాడ మాసం అనారోగ్య మాసం కూడా.. విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే నెల.. దీంతో కాలువలోను, నదులలోను, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల లోనికి వచ్చి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉంది వ్యాధుల బారిన పడతారు.
  7. ఈ నెలలో కొత్తగా పెళ్లి అయిన జంట అత్తా గారి ఇంట్లో అడుగు పెట్టకూడదు అనే సంప్రదాయం ఉంది.
  8. ఆషాడ మాసంలోని కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. అందుకనే తినే ఆహారం విషయంలో కూడా అనేక నియమాలను పెట్టారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.