హిందూ మతంలో అన్నపూర్ణ జయంతి రోజు అన్నపూర్ణ దేవికి అంకితం చేయబడింది. ఎవరైతే అన్నపూర్ణ జయంతి రోజున అమ్మవారిని పూజిస్తారో వారి ఇల్లు ఐశ్వర్యం, సంతోషంతో నిండి ఉంటుంది. ఈ రోజున పూర్ణ క్రతువులతో అమ్మవారిని పూజించేవారి జీవితంలో వచ్చే అన్ని దుఃఖాలను అన్నపూర్ణ దేవి తొలగిస్తుంది. ఈ రోజు చేసే పూజకు మాత్రమే కాదు దానాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున చేసే పూజలు, దానాలు శుభప్రదం అని భావిస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం అన్నపూర్ణ జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రోజున వస్తుంది. ఈ సంవత్సరం మార్గశిర పౌర్ణమి తిథి డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. దీంతో ఉదయతిథి ప్రకారం అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 15వ తేదీన జరుపుకోనున్నారు.
అన్నపూర్ణ జయంతి రోజున నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం చేయండి. అన్నపూర్ణ జయంతి రోజున అన్నదానం, వస్త్రదానం చేయడం శ్రేయస్కరం. ఎవరైతే ఈ రోజున ఆహారం, బట్టలు దానం చేస్తారో అతని జీవితంలో ఎప్పుడూ ఆహారం, డబ్బులకు లోటు ఉండదు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం చేసిన వారికి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.