AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా దొరకకపోవచ్చు!

Amarnath Yatra Checklist: అమర్‌నాథ్ యాత్ర 2026 జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర యాత్రకు వెళ్లే భక్తులు వెంట తీసుకెళ్లాల్సిన తప్పనిసరి వస్తువులు, అవసరమైన పత్రాలు, మందులు, అలాగే తీసుకెళ్లకూడని వస్తువులు ఏమిటో తెలుసుకోండి. సురక్షితమైన, సౌకర్యవంతమైన యాత్ర కోసం పూర్తి చెక్‌లిస్ట్ ఇదే.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా దొరకకపోవచ్చు!
Amarnath Yatra 2026
Rajashekher G
|

Updated on: Jun 29, 2026 | 3:24 PM

Share

Amarnath Yatra 2026: లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న అమర్‌నాథ్ యాత్ర 2026 జూలై 3న ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఆగస్టు 28న (రక్షా బంధన్) ముగియనుంది. యాత్ర ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంప్రదాయ తొలి పూజ నిర్వహించి బాబా బర్ఫానీ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పవిత్ర యాత్రకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా ఈసారి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్లయితే, ముందుగా సరైన సన్నాహాలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎత్తైన ప్రాంతాల్లో జరిగే ఈ యాత్రలో వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. అందుకే ఏం వెంట తీసుకెళ్లాలి? ఏం తీసుకెళ్లకూడదు? తెలుసుకోవడం అత్యంత అవసరం.

తప్పనిసరిగా ప్యాక్ చేసుకోవాల్సిన వస్తువులు

1. వెచ్చని దుస్తులు

అమర్‌నాథ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవచ్చు. కాబట్టి మీ బ్యాగ్‌లో వీటిని తప్పకుండా ఉంచండి. థర్మల్ ఇన్నర్‌వేర్, ఉన్ని స్వెటర్, వాటర్‌ప్రూఫ్ లేదా విండ్‌చీటర్ జాకెట్, ఉన్ని టోపీ, మఫ్లర్, గ్లౌజులు, అదనపు ఉన్ని సాక్సులు, రెయిన్‌కోట్ లేదా పాంచో.

అవసరమైన మందులు మర్చిపోవద్దు

బీపీ, షుగర్, ఆస్తమా లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు తగినన్ని మందులు వెంట తీసుకెళ్లాలి. మీ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి.

ఇవి కూడా చదవండి
  • జ్వరం, నొప్పి, జలుబు మందులు
  • వాంతులు, విరేచనాల మందులు
  • బ్యాండేజ్‌లు
  • టటీసెప్టిక్ క్రీమ్
  • ORS ప్యాకెట్లు
  • వైద్యుడి ప్రిస్క్రిప్షన్

ఈ పత్రాలు తప్పనిసరి

యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా వెంట ఉంచుకోండి.

  • అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ స్లిప్
  • తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం (CHC)
  • ఆధార్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు
  • అన్ని పత్రాల ప్రింట్ కాపీలు
  • మొబైల్‌లో డిజిటల్ కాపీలు
  • అత్యవసర సంప్రదింపు నంబర్ల జాబితా

ప్రయాణంలో ఉపయోగపడే ఇతర వస్తువులు.. టార్చ్ లేదా ఫ్లాష్‌లైట్, అదనపు బ్యాటరీలు, పవర్ బ్యాంక్, మొబైల్ ఛార్జర్, సన్ గ్లాసెస్, సన్‌స్క్రీన్, లిప్ బామ్, నీటి బాటిల్, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు. ఎత్తైన ప్రాంతాల్లో సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే సన్ గ్లాసెస్, సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఈ వస్తువులు అస్సలు తీసుకెళ్లవద్దు

  • అవసరానికి మించి బరువైన సామాను
  • ఖరీదైన నగలు, విలువైన వస్తువులు
  • పెద్ద మొత్తంలో నగదు
  • ప్లాస్టిక్ వ్యర్థాలు
  • మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు
  • వైద్యుడి సలహా లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఇతర మందులు

యాత్రలో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

అమర్‌నాథ్ యాత్ర సముద్ర మట్టానికి చాలా ఎత్తులో జరుగుతుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే..

  • వేగంగా నడవకుండా నెమ్మదిగా ప్రయాణించండి.
  • తగినంత నీరు తాగుతూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోండి.
  • మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోండి.
  • పరిపాలన, భద్రతా సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించండి.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించండి.

గుర్తుంచుకోవాల్సిన విషయం..

అమర్‌నాథ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, శారీరకంగా కూడా ఎంతో సవాలుతో కూడుకున్నది. సరైన ప్రణాళిక, అవసరమైన సామగ్రి, ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే ఈ పవిత్ర యాత్రను సురక్షితంగా, ప్రశాంతంగా పూర్తి చేయవచ్చు.

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!