Vastu Tips: కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి.. దెబ్బకు నక్క తోక తొక్కినట్టే

కలబంద మొక్కను ఇంట్లో సరైన దిశలో, ముఖ్యంగా తూర్పు లేదా ఈశాన్యంలో ఉంచడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. ఇది నరఘోషను దరి చేరకుండా చేయడంతో పాటు ఇంటి యజమానులను దుష్ప్రభావాల నుంచి కాపాడుతుందని అన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Vastu Tips: కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి.. దెబ్బకు నక్క తోక తొక్కినట్టే
Aloe Vera Plant

Updated on: Feb 05, 2026 | 12:37 PM

కలబంద మొక్కను ఇంట్లో సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచడం ద్వారా అనేక శుభాలు, ధన లాభం కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు. వృక్షశాస్త్రం, ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం కలబందకు లక్ష్మీ ప్రదమైన మొక్కగా ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముక్కోటి దేవతలు కలబంద మొక్కలో నివసిస్తారని నానూడి. తులసి మొక్క లానే కలబంద కూడా పవిత్రమైనది. దీని గుజ్జు, బెరడు ఆయుర్వేదంలో ఎన్నో శారీరక సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. గృహ సంబంధిత విషయాలలో కలబంద మొక్క కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి యజమానులకు నరఘోష తగలకుండా.. దాన్ని నివారిస్తుంది.

నరఘోష నుంచి తమ ఇంటికి రక్షణగా ఉండాలంటే కలబంద మొక్కను గుమ్మానికి తిరగేసి కడతారని జ్యోతిష్యులు అంటున్నారు. సాధారణంగా వేర్లు కింద, కాండం పైన ఉండే మొక్క కాకుండా, దీని వేర్లు పైకి, కాండం కిందకు ఉండేలా కట్టడంలో ఒక కారణం ఉంది. వేరు, కాండం రాహు, శని గ్రహాలకు సంబంధించిన స్థానాలని, ఇవి ఇంటిలోకి ప్రవేశించే వ్యక్తులపై ప్రభావం చూపకుండా కిందికి తిరిగి ఉండాలని నమ్ముతారు. గాలిలోని తేమ ద్వారా కలబంద పెరుగుతుంది. దాని ఆకులు, కాండాల ద్వారానే శక్తి ప్రసరిస్తుంది కాబట్టి, నరఘోష వ్యక్తులపై ప్రభావం చూపకుండా ఈ విధంగా కడతారు. నరఘోష బలంగా ఉన్నప్పుడు, కట్టిన రెండు-మూడు రోజుల్లోనే కలబంద వాడిపోయి, తన జీవత్వాన్ని కోల్పోతుంది. ఇది ఇంటికి రాబోయే చెడును తను స్వీకరించి, యజమానులను కాపాడినట్లుగా భావిస్తారు.

కలబంద మొక్కను ఇంటి లోపల కాకుండా, బయటి భాగంలో, ముఖ్యంగా తూర్పు లేదా ఈశాన్య దిక్కున పెంచడం శ్రేయస్కరం. తులసి మొక్కకు దగ్గరగా ఉంచడం మంచిదని చెబుతారు. ఈశాన్యం ఈశ్వరుడి స్థానం. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. విభూతిని ఐశ్వర్యంగా ధరించే ఆయన, భక్తులకు సిరిసంపదలను ప్రసాదిస్తాడు. ఈ దిక్కున లక్ష్మీప్రదమైన కలబంద, తులసి లాంటి మొక్కలను ఉంచడం ద్వారా ఐశ్వరానుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ విధంగా కలబంద మొక్క వాస్తు, ఆయుర్వేదాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us