Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు.. ఎందుకంటే..
హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏ పని చేయడానికైనా శుభ ముహుర్తం చూడాల్సిన పని లేదని నమ్ముతారు. ఈ రోజున బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం వలన విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనద్దు.. అశుభం అని చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు.

వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిధి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది 2025 అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం వచ్చింది. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం, వెండి వంటి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అందుకనే ఈ రోజున ఏవైనా వస్తువులు కొనుగోలు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వలన మంచి కంటే చెడు జరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం అవి ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం అశుభం అని నమ్మకం. ఈ రోజున అక్షయ తృతీయ కొనకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఏ పనులు చేయవద్దంటే..
- ఈ రోజున పొరపాటున కూడా కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనవద్దు. ఈ వస్తువులు కొనడం వలన ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
- అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను దరించవద్దు. అంతేకాదు నలుపు రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్ ను, ఇనుప వస్తువులను కొనుగోలు చేయవద్దు.
- నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం.
- ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ సామాన్లను, అల్యూమినియం పాత్రలను కొనవద్దు.
- ముళ్ళు ఉన్న మొక్కలను, ముళ్ళ పువ్వులను కొనుగోలు చేయవద్దు.. ఇంటికి తీసుకు రాకూడదు. వీటిని ఇంటికి తీసుకుని రావడం వలన ఇంటికి శుభంగా పరిగణించబడవు. కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను చేయవద్దు..
- ఈ రోజున బంగారం, వెండి వస్తువులు కొనలేకపోతే… ఇనుప, పదునైన వస్తువులను. కొని కోరి కష్టాలను తెచ్చుకోకండి. అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.