Chanakya Niti: పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేయవద్దు.. బంధంలో బీటలు వస్తాయంటున్న చాణక్య..
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మనుషుల జీవన విధానానికి, మానవ సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలను గురించి చెప్పాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం చాణక్య చెప్పిన నీతి సూత్రాలు నేటికీ అనుసరణీయం. ఈ సూత్రాలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవని కనుక జీవితంలో వాటిని ఎప్పుడూ పాటించాలని సూచించారు. ఈ రోజు చాణక్యుడు చెప్పిన సూత్రాల్లో తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం గురించి కూడా ఒకటి. ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం బలపడాలంటే చేయకూడని కొన్ని తప్పులు ఏమిటో తెలుసుకుందాం..

తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమమైన వాటిని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయితే తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా.. కొన్నిసార్లు తల్లిదండ్రులు తెలిసి తెలియక తప్పులు చేస్తారు. అది వారిని పిల్లల మనస్సుల్లో విలన్‌లుగా చిత్రీకరించేలా చేస్తుంది. ఇది తల్లిదండ్రుల పిల్లల సంబంధంలో బీటలు వచ్చేలా చేస్తుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధం తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, వ్యూహకర్త అయిన ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. తమ పిల్లలకు మంచివి అనుకుని తల్లిదండ్రులు చేసే పనులు.. తమకు తెలియకుండానే తల్లిదండ్రుల పిల్లల మద్య బంధంలో విబేధాలు ఏర్పడతాయని పేర్కొన్నాడు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేయకూడని 4 విషయాలు ఏమిటో తెలుసుకుందాం..
పోలిక: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చవద్దు. తల్లిదండ్రులు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే.. తమ పిల్లలను పక్కింటి పిల్లలతో లేదా బంధువుల పిల్లలతో పోల్చడం. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రశంసల కోసం పోరాడటం ప్రారంభిస్తాడు. తల్లిదండ్రులు.. తమ పిలల్ని తక్కువ చేసి మాట్లాడితే.. ఫలితంగా, పిల్లలు చొరవ తీసుకోవడానికి కొత్తగా ఆలోచించడానికి వెనుకాడతారు. అప్పుడు పిల్లలల వ్యక్తిత్వం ప్రభావితమవుతుంది. దీనిని నివారించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దు అని చెప్పాడు చాణక్య.
భావాలను అర్థం చేసుకోవడం: తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలు.. భావాలను గౌరవించకపోతే.. అది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పేది వినాలి.. చెప్ప వద్దు అని ఆపకూడదు. పిల్లలు తమ ఆలోచనలను వ్యక్తపరిచినప్పుడు.. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల భావాలను తీవ్రంగా పరిగణించకుండా వాటిని పట్టించుకోక పోతే తల్లిదండ్రులు.. పిల్లల మధ్య సంబంధం మరింత దిగజారిపోతుంది. పిల్లలకు కూడా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలలో పిల్లలు వారి సొంత అభిప్రాయాలను వ్యక్తీకరించి.. వాటిని అమలు చేసే హక్కు వారికి ఉంది. అయితే పిల్లలు చేసే పనుల్లో ఏదైనా తప్పు ఉంటే.. తల్లిదండ్రులు ఆ తప్పులను తెలియజేసి.. ఎందుకు తప్పో వివరించాలి అని చాణక్య చెప్పాడు.
ప్రశంసలు: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా పొగడకూడదు. మీ పిల్లలు మీకు ఎంత మంచివాళ్ళుగా అనిపించినా.. వారిని పొగడవద్దు. మీరు మీ బిడ్డను ఇతరుల ముందు పొగడినప్పుడు.. వారి చెడు దృష్టి పిల్లలపై పడవచ్చు. అయితే సమయం సందర్భం వచ్చినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలి అని చాణక్య సూచించాడు.
అపనమ్మకం: తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రతికూల వైఖరిని కలిగి ఉండకూడదు. పిల్లలను ప్రోత్సహించే అలవాటును తల్లిదండ్రులు పెంచుకోవాలి. పిల్లలు ఏదైనా చేయడం ప్రారంభించినప్పుడు మీరు దీనిని చేయలేరని తల్లిదండ్రులు నిరస పరిచేలా మాట్లాడవద్దు. ఇలా మాట్లాడడం వలన పిల్లల మనస్సు గాయపడుతుంది. అంతేకాదు పిల్లల పురోగతికి ఆటంకం కలిగించవచ్చని తెలిపాడు నీతి శాస్త్రంలో చాణక్య.
ప్రతి తల్లిదండ్రులు పైన పేర్కొన్న విషయాలను అనుసరించినప్పుడు.. తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మధ్య సంబంధం బలపడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.