Akshaya Tritiya 2021: లక్ష్మీ నరసింహ స్వామి… దేవాలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. అయితే వరాహ, నరసింహ అవతారాలు కలిసి ఉండే విగ్రహం ఉన్న ఏకైక హిందూ దేవాలయం సింహాచలంలో మాత్రమే ఉంది. ఇక్కడి ఆలయంలో శ్రీ మహా విష్ణువు వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా పూజలందుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామిని భక్తులు కొలుస్తుంటారు. అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది.అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరుపుతారు. ఉత్సవంలో భాగంగా సింహాచలేశుని మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో మేల్కొలిపి గంగధార నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శిరస్సు, వక్షస్థలంపైన రెండు పచ్చి చందనపు ముద్దలను ఉంచుతారు.
ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆలయంలోకి భక్తులెవరిని అనుమతించడం లేదు. కేవలం ప్రధాన పూజారులు మాత్రమే శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను మీరు టీవీ 9లో ప్రత్యేక్ష ప్రసారంలో చూడవచ్చు.
లైవ్..
Happy Eid-ul-Fitr 2021: మీ ఆత్మీయులకు ఈద్ ఉల్ ఫితర్ విషెస్ తెలియజేయండిలా.. రంజాన్ శుభాకాంక్షలు..
Basara Saraswati Temple: బాసర సరస్వతీ క్షేత్రంలో అపచారం అంటూ తప్పుడు ప్రచారం.. ఆలయ అధికారుల వివరణ..