Lord Shiva Worship: ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నారా.. అయితే ఈ నియమాలను తప్పకుండా పాటించాల్సిందే..

శివలింగాన్ని తమ ఇంట్లోని పూజ గదిలో ప్రతిష్టించి పూజించేవారు కూడా ఉన్నారు. ఇలా చేయడం శుభప్రదంగా భావించవచ్చు. అయితే ఇలా ఇంట్లో లింగాన్ని పెట్టుకుని పూజించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Lord Shiva Worship: ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నారా.. అయితే ఈ నియమాలను తప్పకుండా పాటించాల్సిందే..
Shivalingam

Updated on: Jun 05, 2022 | 8:07 PM

Lord Shiva Worship: త్రిమూర్తుల్లో ఒకరైన శివయ్యకు మనదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఆలయాలున్నాయి. జలంతో అభిషేకం చేసినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. ఈ జంగమయ్యను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. అయితే ఒక్కసారి శివయ్య అనుగ్రం కలిగిందంటే చాలు.. వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది.  శివుని అనుగ్రహం పొందడానికి, భక్తులు పూజలు, ఉపవాసాలు, అభిషేకం వంటి పద్ధతులను అవలంబిస్తారు. చాలా మంది ప్రజలు శివుని పూజించడానికి శివలింగాన్ని పూజిస్తారు. శివలింగాన్ని తమ ఇంట్లోని పూజ గదిలో ప్రతిష్టించి పూజించేవారు కూడా ఉన్నారు. ఇలా చేయడం శుభప్రదంగా భావించవచ్చు. అయితే ఇలా ఇంట్లో లింగాన్ని పెట్టుకుని పూజించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కొన్నిసార్లు ప్రజలు పొరపాటున శివలింగానికి సంబంధించి కొన్ని తప్పులు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వారు శివుని ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. శివలింగాన్ని ఇంట్లో పూజా గదిలో ఉంచి పూజిస్తున్నట్లు అయితే.. ఈ పనులను ఎప్పుడూ  చేయకండి. అవి ఏమిటో తెలుసుకుందాం..

1. పసుపులో అందాన్ని పెంచే గుణం ఉంది. అయితే ఇంట్లో ఉన్న శివలింగానికి పసుపుతో పూజలు చేయవద్దు.  ఇలా పసుపుతో పూజలు చేయడం వలన అధికంగా ఖర్చు చేస్తారు.

ఇవి కూడా చదవండి

2. శివలింగాన్ని కుంకుమతో అలంకరించవద్దు. శివలింగానికి కుంకుమతో అలంకరించడం వలన కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వివాదాలు ఏర్పడతాయట.

3. కొందరు వ్యక్తులు రాయి, పాలరాయితో చేసిన శివలింగాన్ని ఇళ్లలో ప్రతిష్టిస్తారు. అయితే జ్యోతిషశాస్త్రంలో ఇది అశుభం అని చెప్పబడింది. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలంటే అది బంగారం, ఇత్తడి లేదా వెండితో తయారు చేసింధై ఉండాలని నమ్మకం.

4. కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టిస్తారు. అయితే లింగాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇలాంటి పొరపాటు శివునికి అగ్రహాన్నీ తెలిప్పిస్తుందట.

5. ఇంట్లో ప్రతిష్టించిన శివలింగానికి తులసిని సమర్పించకూడదని నమ్ముతారు. ఇలా చేయడం వలన ఇంట్లో కలహాలు ఏర్పడతాయట. ఎవరైనా ఇంట్లో శివయ్యని తులసితో పూజిస్తుంటే.. మానివేసి.. అందుకు బదులుగా బిల్వ పత్రాలతో లింగానికి సమ్పరించండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని  ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..