Muttu Maremma Jatara: భక్తుల కొంగు బంగారం ముత్తు మారెమ్మ.. నేటి నుంచి మూడు రోజులపాటు జాతర
ముత్తు మారెమ్మ ఆలయ నిర్మాణం భారత రైల్వే తో ముడి పడింది. 1955 వ సంవత్సర కాలంలో రైల్వే పరంగా నందలూరు దేదీప్యమానంగా వీరాజులుతుంది. ఆ రోజుల్లో ఎక్కువగా స్ట్రీమ్ ఇంజన్లు నడిపేవారు సదరన్ రైల్వేలో స్ట్రీమ్ ఇంజన్ లోకో షెడ్లు మద్రాస్ రాష్ట్రంలోని అరక్కో ణంలోనూ మరియు ఆంధ్రప్రదేశ్లోని నందలూరులో మాత్రమే ఉండేవి.
ముత్తు మారెమ్మ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమైంది.. నిత్యం పూజలు అందుకునే పవిత్రమూర్తిగా వెలసింది, రోజు పూజలు, ఏటా జాతరలు క్రమం తప్పకుండా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడో తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ముత్తు మారెమ్మకు అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని అరవపల్లి లో ఆలయం ఎలా నిర్మించారు? ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారు? అన్న ప్రశ్నల వెనుక పలు ఆసక్తికరమైన విషయాలు, లోతైన చరిత్ర ఉంది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లి లో వెలసిన ముత్తు మారెమ్మ జాతర అంటే ఒక కోలాహలమే.
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లి లో ముత్తు మారెమ్మ ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ దేవత చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తమిళనాడు లో ముత్తు మారెమ్మ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవత.. నందలూరు లో అమ్మవారికి కోవెల నిర్మించారు. నిత్యం ఇక్కడ పూజలు చేస్తుంటారు. స్థానిక ప్రజలు కూడా అమ్మ వారిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు.
భారత రైల్వే తో ముడిపడిన ఆలయ నిర్మాణం
ముత్తు మారెమ్మ ఆలయ నిర్మాణం భారత రైల్వే తో ముడి పడింది. 1955 వ సంవత్సర కాలంలో రైల్వే పరంగా నందలూరు దేదీప్యమానంగా వీరాజులుతుంది. ఆ రోజుల్లో ఎక్కువగా స్ట్రీమ్ ఇంజన్లు నడిపేవారు సదరన్ రైల్వేలో స్ట్రీమ్ ఇంజన్ లోకో షెడ్లు మద్రాస్ రాష్ట్రంలోని అరక్కో ణంలోనూ మరియు ఆంధ్రప్రదేశ్లోని నందలూరులో మాత్రమే ఉండేవి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వృత్తిరీత్యా నందలూరుకు అనేక మంది ప్రజలు వస్తుండేవారు. ఈ క్రమంలో తమిళనాడు నుంచి వచ్చిన ఉద్యోగులు అధికంగా ఉండేవారు. తమిళనాడు నుంచి వచ్చిన ఉద్యోగులు అధికంగా ఉండడం వల్ల నందలూరులోని ఓ ప్రాంతం ఆరవపల్లెగా పిలవబడేది. ఈ ప్రాంతంలో ఉన్న తమిలులు ముఖ్యంగా మొదలియార్ వర్గానికి చెందినవారు ఇక్కడ 1955వ సంవత్సరంలో ముత్తు మారమ్మ కోవెల నిర్మించారు. అప్పటినుంచి అమ్మవారికి ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఓసారి మూడు రోజులు పాటు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. సంవత్సరాలు దాటినా ఈ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం మారలేదు. క్రమేపి రైల్వే పరంగా నందలూరు ప్రభావం కోల్పోవడం, సదరన్ రైల్వే నుండి సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పడడం అనంతరం ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చిన తమిళనాడులో అధిక శాతం తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడం జరిగింది. అయినప్పటికిని వారి నిర్మించిన ముత్తు మారెమ్మ ఆలయం ఆంధ్ర ప్రజల ఇష్ట దైవంగా మారి భక్తుల కొంగుబంగారంగా వీరాజీలుతోంది.
నేటి నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతర
స్థానిక ప్రజలు ప్రతి ఏటా ముత్తు మారమ్మ దేవతకు జాతర నిర్వహిస్తారు. ఈ ఆలయం మొదలియార్ వంశీకుల ఆధీనంలో నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త సేలం వెంకటరమణ మొదలియార్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. పూర్వీకల నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడది కూడా అమ్మవారి జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పేర్కొన్నారు. అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కేరళ డ్రమ్స్ మరియు విచిత్ర వేషధారణ,కాళికా వేషం, అమ్మ వారి వేషం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలువ నున్నాయి.జాతరలో భాగంగా శనివారం అమ్మవారి ఊరేగింపు, ఆదివారంజాతర, సోమవారం అమ్మవారి పాలపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇలా తమిళుల సంస్కృతి సాంప్రదాయాల వల్ల నిర్మితమైన ముత్తు మారెమ్మ ఆలయం ఆంధ్ర ప్రజల జీవితాల్లో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న సంస్కృతుల సమ్మేళనం అదే కదా భారతదేశం గొప్పతనం. ఇందుకు నిలువెత్తు నిదర్శనం నందలూరు మండలం అరవపల్లి లోని ముత్తు మారెమ్మ ఆలయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..