AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆగస్టు 15న ప్రధానమంత్రి, జనవరి 26న రాష్ట్రపతి ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..

దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను జాతీయ పండుగలుగా జరుపుకుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని జెండా ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేసే బాధ్యతను రాష్ట్రపతి నిర్వహిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో, రెండు జాతీయ పండుగల్లోనూ జెండా ఎగురవేయాలనే నిబంధన ఎందుకు భిన్నంగా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం.. 

Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆగస్టు 15న ప్రధానమంత్రి, జనవరి 26న రాష్ట్రపతి ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..
Independence Day 2023
Surya Kala
|

Updated on: Aug 13, 2023 | 9:34 AM

Share

దేశంలో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆగస్టు 15న మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రాకారంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసిన వారిని స్వాతంత్య్ర పాటల నడుమ స్మరించుకుంటారు. దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను జాతీయ పండుగలుగా జరుపుకుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని జెండా ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేసే బాధ్యతను రాష్ట్రపతి నిర్వహిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో, రెండు జాతీయ పండుగల్లోనూ జెండా ఎగురవేయాలనే నిబంధన ఎందుకు భిన్నంగా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం..

గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడంలో వ్యత్యాసం

రిపబ్లిక్ డే జనవరి 26 న జరుపుకుంటారు. ఎందుకంటే మన రాజ్యాంగం 1950లో ఈ రోజున అమల్లోకి వచ్చింది. అయితే ఆగస్టు 15 బానిసత్వ శృంఖలాల నుండి స్వేచ్ఛకు చిహ్నంగా జరుపుకుంటారు. విశేషమేమిటంటే ఆగస్టు 15వ తేదీ ధ్వజానికి జెండాను కట్టి తాడుతో పైకి తీసుకెళ్లి, ఆ తర్వాత ధజారోహణ చేస్తారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని గణతంత్ర దినోత్సవం రోజున జెండాను కట్టి, ఆవిష్కరిస్తారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని ఎందుకు జెండా ఎగురవేస్తారంటే

స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశ ప్రధానమంత్రి మాత్రమే జెండాను ఎగురవేస్తారు. వాస్తవానికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను 15 ఆగస్టు 1947 నుండి జరుపుకోవడం మొదలు పెట్టాం. ఆ సమయంలో దేశంలో రాజ్యాంగం లేదు. అప్పటికి రాష్ట్రపతి పదవిని చేపట్టలేదు. అందుకే తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎగురవేశారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి జెండాను ఎందుకు ఎగురవేస్తారంటే..

గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగం అమలు చేసిన సందర్భంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. అందుకే రాష్ట్రపతి ఈ రోజున జెండాను ఎగురవేస్తారు. ఎందుకంటే రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. దేశానికి రాజ్యాంగ అధిపతి. అప్పటి నుంచి రిపబ్లిక్ డే రోజున  రాష్ట్రపతి ఎర్రకోటపై త్రి వర్ణ పతకం ఎగురవేసే సంప్రదాయం మొదలైంది.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు, ఎర్రకోట ప్రాకారంపై జెండా ఎగురవేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రిపబ్లిక్ డే రోజున రాజా మార్గంలో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భారీ కవాతు కూడాను నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..