Crime: కీచకుడికి మూడేళ్ల శిక్ష విధించిన ఎర్నాకులం జిల్లా జడ్జి.. అసలేం జరిగిందంటే..

Crime: కీచకుడికి మూడేళ్ల శిక్ష విధించిన ఎర్నాకులం జిల్లా జడ్జి.. అసలేం జరిగిందంటే..

Anil kumar poka

|

Updated on: Aug 13, 2023 | 9:10 AM

‘‘హలో.. లవ్యూ బేబీ! డ్యూటీ ఎప్పుడయిపోతుంది, నా దగ్గరికి ఎప్పుడొస్తున్నావ్? అలా బీచీకి వస్తే ఎంజాయ్ చేద్దాం’’ అంటూ ఓ కీచకుడు ఒక మహిళకు 300 ఫోన్ కాల్స్ చేశాడు. ఆమె పోలీస్ అధికారి అని తెలిసినా వదిలిపెట్టలేదు. తను మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న ‘వనితా పోలీస్ స్టేషన్’లో పనిచేస్తున్నానురా బాడ్కవ్ అని హెచ్చరించినా లైట్ తీసుకుని వేధించాడు.

‘‘హలో.. లవ్యూ బేబీ! డ్యూటీ ఎప్పుడయిపోతుంది, నా దగ్గరికి ఎప్పుడొస్తున్నావ్? అలా బీచీకి వస్తే ఎంజాయ్ చేద్దాం’’ అంటూ ఓ కీచకుడు ఒక మహిళకు 300 ఫోన్ కాల్స్ చేశాడు. ఆమె పోలీస్ అధికారి అని తెలిసినా వదిలిపెట్టలేదు. తను మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న ‘వనితా పోలీస్ స్టేషన్’లో పనిచేస్తున్నానురా బాడ్కవ్ అని హెచ్చరించినా లైట్ తీసుకుని వేధించాడు. ఆమె మొదట్లో లైట్ తీసుకుని వదిలేసింది. వందల ఫోన్లు రావడంతో తిక్క కుదిర్చాలను పక్కా ప్లాన్ వేసింది. ‘ఓకే డియర్. సాయంత్రం నీ దగ్గరికే వస్తున్నా. రెడీగా ఉండు. ఎంజాయ్ చేద్దాం’’ అని ఫోన్ చేసింది. ఆమె చెప్పిన సమయానికి ప్రబుద్ధుడు రెడీగా కాచుకుని ఉన్నాడు. ఆమె నవ్వుతూ వెళ్లి ముచ్చట్లు పెట్టుకుంది. తర్వాత లేడీస్ బ్యాగు ఓపెన్ చేసి బేడీలు బయటికి తీసింది. దగ్గర్లోనే ఉన్న పోలీసులు క్షణాల్లో వచ్చి కీచకుడి ఆటకట్టించాడు. అతనిపై లైంగిక వేధిపుల కింద, ప్రభుత్వోద్యోగులను పనిచేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేశారు. 2019లో కేరళలోని కొచ్చిలో జరిగిందీ ఉదంతం. నాలుగేళ్ల తర్వాత కొచ్చి కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 300 కాల్స్ చేసిన జోస్‌కు ఎర్నాకులం జిల్లా జడ్జి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు 15 వేల జరిమానా కూడా విధించారు. తప్పయిపోయిందని, శిక్ష తగ్గించాలని వేడుకున్నా జడ్జి కనికరించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...