Viral Video: వావ్‌ బుడ్డోడా..! అమ్మకోసం రిస్క్ చేసావా.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: వావ్‌ బుడ్డోడా..! అమ్మకోసం రిస్క్ చేసావా.. వైరల్‌ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 13, 2023 | 8:59 AM

కన్నతల్లితో పిల్లలకుండే ప్రేమ, ఆప్యాయతలు, సాన్నిహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత గొప్పది వీరి అనుబంధం. అయితే సాధారణంగా అపాయంలో ఉన్న బిడ్డల్ని కాపాడుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయని వీరమాతల గాథల్ని చూశాం. తాజాగా కష్టంలో ఉన్న అమ్మను ఆదుకునేందుకు ఓ క్యూట్‌ బోయ్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కన్నతల్లితో పిల్లలకుండే ప్రేమ, ఆప్యాయతలు, సాన్నిహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత గొప్పది వీరి అనుబంధం. అయితే సాధారణంగా అపాయంలో ఉన్న బిడ్డల్ని కాపాడుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయని వీరమాతల గాథల్ని చూశాం. తాజాగా కష్టంలో ఉన్న అమ్మను ఆదుకునేందుకు ఓ క్యూట్‌ బోయ్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యాప్‌ సర్కిల్‌ కోఫౌండర్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ఇది వ్యూస్‌లో 1.6 మిలియన్లు దాటేసింది. విషయం ఏంటంటే.. నిచ్చెన సాయంతో పనిచేసుకుంటున్న మహిళ ఉన్నట్టు ఉండి ఆ నిచ్చెనపై పట్టు కోల్పోతుంది. దీంతో నిచ్చెన కాస్త కిందపడిపోతుంది. ఫలితంగా ఆ మహిళ పైనున్న ఒక దూలం లాంటిదాన్నిపట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఇది చూసిన బుడ్డోడు.. అదే మన లిటిల్‌ హీరో..వెంటనే రంగంలోకి దిగిపోయాడు. నిచ్చెన మెల్లిగా లేపి తల్లికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆమె దిగేదాకా ఆ ల్యాడర్‌ను జాగ్రత్తగా పట్టుకోవడం ముచ్చటగా నిలిచింది దీనిపై నెటిజన్లు లిటిల్‌ హీరో అంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...