Mercury Transit 2023: ఆ రాశివారికి సంతాన ప్రాప్తి, విదేశీయానం.. కన్యారాశిలో బుధ సంచారంతో లాభం పొందే రాశులివే..!

Mercury Transit 2023: గ్రహ సంచారం కారణంగా కలిగే మార్పులు కొందరికి శుభప్రదంగా, మరికొందరికి అశుభంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. తెలివి, సంపదలకు కారకుడిగా చెప్పుకునే బుధుడు అక్టోబర్ 1న కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ఫలితంగా రాశి చక్రంలోని 3 రాశులవారి జీవితాల్లో శుభ ఘడియలు రానున్నాయి. ఫలితంగా ఆయా రాశులవారు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయి, సమాజంలో కీర్త ప్రతిష్టలను..

Mercury Transit 2023: ఆ రాశివారికి సంతాన ప్రాప్తి, విదేశీయానం.. కన్యారాశిలో బుధ సంచారంతో లాభం పొందే రాశులివే..!
Mercury Transit 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 13, 2023 | 6:28 PM

Mercury Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితిగతులకు అధిక ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ గ్రహాల సంచార, తిరోగమనాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతుంటారు. ఇక ఈ ఫలితాలు కొందరికి శుభప్రదంగా, మరికొందరికి అశుభంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. తెలివి, సంపదలకు కారకుడిగా చెప్పుకునే బుధుడు అక్టోబర్ 1న కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ఫలితంగా రాశి చక్రంలోని 3 రాశులవారి జీవితాల్లో శుభ ఘడియలు రానున్నాయి. ఫలితంగా ఆయా రాశులవారు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయి, సమాజంలో కీర్త ప్రతిష్టలను సంపాదిస్తారు. అసలు కన్యా రాశిలో బుధ గ్రహ సంచారం ఏయే రాశులకు శుభంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కన్యా రాశి: కన్యా రాశిలో బుధ గ్రహ సంచారం ఈ రాశిలోనే జరగనుండడంతో వీరికి శుభఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు ఇంక్రిమెంట్ పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో వృద్ధి చెందుతారు. ఆగి పోయిన పనులు అన్నీ పూర్తి అవుతాయి. సమాజంలో మీ వ్యక్తిత్వానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి: కన్యా రాశిలో బుధ గ్రహ సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలను ఇచ్చేదిగా ఉండనుంది. ఈ సంచార సమయంలో మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కెరీర్‌లో శిఖరాగ్రాలకు చేరుకుంటారు. విదేశి విద్యపై మీ ఆశలు నెరవేరుతాయి. అలాగే అన్ని రకాల వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

ఇవి కూడా చదవండి

మకర రాశి: కన్యా రాశిలో బుధుడి సంచారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం మీకు అత్యంత విజయవంతమైనవిగా ఉంటుంది. ఇంకా విదేశీ పర్యటనకు వెళ్తారు. ఈ సమయంలో మీ తెలివితేటలు వృద్ధి చెంది, చక్కని ఫలితాలను పొందుతారు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్