Sekhar Kammula : టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. సినిమా కూడా కనెక్ట్ అవుతుందని హోప్ వచ్చిందన్న శేఖర్ కమ్ముల
టాలీవుడ్ సెన్సబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' అనే అందమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని హీరో నాగచైతన్య..

టాలీవుడ్ సెన్సబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే అందమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని హీరో నాగచైతన్య, ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తెలంగాణ యాసలో నాగ చైతన్య, సాయిపల్లవి ఆకట్టుకున్నారు. ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పంధించారు.
టీజర్ కు మంచి స్పందన వస్తుంది చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మేం అనుకున్న కథకు సంబంధించిన క్యారెక్టర్స్ ను టీజర్ ద్వారా రివీల్ చేశాం. టీజర్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా కూడా తప్పకుండ కనెక్ట్ అవుతుందని హోప్ వచ్చింది. చిన్న ఊరు నుంచి సిటీకి వచ్చి సెటిల్ అవుదామనుకున్న ఓ యువకుడు ప్రయత్నం ఎలా ఉంటుందనేది సినిమాలో చూస్తారు అని అన్నారు. ఇక చైతన్య డైలాగ్స్, యాక్టింగ్ విషయంలో చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Aishwarya Rajesh : ‘డ్రైవర్ జమున’గా మారిన ఐశ్వర్య రాజేష్.. కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన బ్యూటీ
Master Movie : విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ ‘మాస్టర్’.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..