కోర్టు మూవీ హీరోయిన్ 'జాబిలి' ఇప్పుడేం చదువుతుందో తెలుసా?

28 April 2025

Basha Shek

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రియదర్శి లీడ్ రోల్‌ లో తెరకెక్కిన సినిమా 'కోర్ట్' ఈ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు.

థియేటర్లలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన కోర్ట్  సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ రికార్డులు బద్దలు కొడుతోంది.

ఇందులో పేదింటి అబ్బాయి చందు పాత్రలో రోషన్ మెప్పించగా..  పెద్దింటి అమ్మాయిగా జాబిలి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది.

దీంతో అసలు ఎవరీ జాబిలి.. ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ నెటిజన్లు శ్రీదేవి గురించి గూగూల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ జాబిలి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఏపీలోని కాకినాడ ఈమె సొంతూరు.

 శ్రీదేవి ఇన్ స్టా రీల్స్ ను చూసిన డైరెక్టర్ రామ్ జగదీష్ వెంటనే  కోర్టు సినిమాలో ఆమెనే జాబిలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడట.

ఆ తర్వాత ఆడిషన్ కు పిలిపించి వెంటనే సినిమాకు సెలెక్ట్ చేశారట. ఇంతకీ కోర్టు మూవీ హీరోయిన్ ఇప్పుడేం చదువుతుందో తెలుసా?

 తాను ప్రస్తుతం ఇంటర్మీయెట్ రెండో సంవత్సరం చదువుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీదేవి అప్పాళ.