AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు.. స్టార్ హీరోయిన్

చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రల్లో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. కొంతమంది లేడీ విలన్స్ గానూ మెప్పిస్తున్నారు. ఓ సీనియర్ హీరోయిన్ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు.. స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 29, 2025 | 7:48 AM

Share

ఇద్దరు హీరోయిన్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ గా ఉండలేరు అంటుంది ఓ అందాల భామ. పైకి మేము స్నేహితులం అని చెప్పుకున్నా కూడా వారు నిజంగా ఫ్రెండ్స్ లా ఉండలేరట.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు ఓ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆమె.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇప్పటికీ తరిగిపోని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన  అందాల భామలు చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో సిమ్రాన్ ఒకరు. ఈ అమ్మడు ఒకప్పుడు తన అందంతో ఇండస్ట్రీని ఊపేసింది. ఎంతోమందికి ఫెవరేట్ హీరోయిన్, కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ సిమ్రాన్. జీరో సైజ్ నడుముతో కుర్రకారును కట్టిపడేసింది. అద్భుతమైన నటనతో పాటు ఆహా అనిపించే అందంతో మెప్పించింది సిమ్రాన్. యంగ్ హీరోల దగ్గర నుంచి అగ్రహీరోల వరకు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది సిమ్రాన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోలు కూడా అప్పట్లో ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది ఈ క్రేజీ బ్యూటీ.

ప్రస్తుతం సిమ్రాన్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో సిమ్రాన్ చివరిగా జాన్ అప్పారావ్ 40ప్లస్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్ లో నటించలేదు. కానీ హిందీలో అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్. రీసెంట్ గా అజిత్ అగ్లీ సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా సిమ్రాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్‌ కాలేరన్నది నిజం అని ఆమె అన్నారు. ఇటీవలే ఆమె తన కో స్టార్ ఒకరు ఆంటీ పాత్రల గురించి తక్కువ చేసి మాట్లాడిందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎవరిని అన్నదా అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అయితే ఇదే విషయం పై సిమ్రాన్ మాట్లాడుతూ.. ఆంటీ అనే పదాన్ని నేను అవమానంగా ఫీలవ్వను.. ఇష్టంగానే భావిస్తాను. ఆ పాత్రలు చేయడం తప్పేం కాదు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఓ విషయం అర్ధమైంది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎప్పటికీ.. ఫ్రెండ్స్‌ కాలేరని తేలిపోయింది.ఫ్రెండ్స్ అనుకునేవాళ్లు ఇలా మాట్లాడితే మనకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె నాతో మామూలుగానే మాట్లాడింది. కానీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రం మునుపటిలా ఉండదు అని చెప్పుకొచ్చింది సిమ్రాన్. దాంతో నెటిజన్స్ ఇప్పుడు సిమ్రాన్ ఎవరి గురించి ఆ కామెంట్స్ చేసిందో తెలుసుకునే పనిలో పడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?