Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయ్ కిరణ్‌ మూవీపై చిరు ఏమన్నాడు..? సంచలన నిజాలు చెప్పిన నిర్మాత

ఉదయ్ కిరణ్.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన అద్భుత నటుడు. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ నటుడిని అల్లుడిగా చేసుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆరాటపడ్డాడు. ఈ క్రమంలో చిరు పెద్ద కుమార్తెతో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వగా.. ఇక రానురాను అతడి కెరీర్ తలకిందులైంది. ఉన్న సినిమాలు క్యాన్సిల్ అవ్వడం, కొత్త అవకాశాలు రాకపోవడంతో […]

ఉదయ్ కిరణ్‌ మూవీపై చిరు ఏమన్నాడు..? సంచలన నిజాలు చెప్పిన నిర్మాత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 26, 2019 | 1:58 PM

ఉదయ్ కిరణ్.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన అద్భుత నటుడు. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ నటుడిని అల్లుడిగా చేసుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆరాటపడ్డాడు. ఈ క్రమంలో చిరు పెద్ద కుమార్తెతో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వగా.. ఇక రానురాను అతడి కెరీర్ తలకిందులైంది. ఉన్న సినిమాలు క్యాన్సిల్ అవ్వడం, కొత్త అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా తనువు చాలించాడు. దీంతో టాలీవుడ్ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇక ఆయన ఆత్మహత్యకు చిరంజీవినే కారణమని అప్పట్లో ఓ వర్గం తెగ ప్రచారం చేసింది.

దీనిపై ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. నిశ్చితార్ధం క్యాన్సిల్ అయిన తరువాత కూడా ఉదయ్‌ను చిరంజీవి చాలా ప్రోత్సహించారని.. ఒకట్రెండు సార్లు ఇంటికి కూడా వెళ్లి కలిసొచ్చాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయాన్ని నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఉదయ్‌ను చిరు చాలా ఎంకరేజ్ చేశాడని పేర్కొన్నారు. ఉదయ్‌తో తాను వియ్యాల వారి కయ్యాలు అనే చిత్రాన్ని తీశానని.. ఆ సినిమాను విడుదల చేసే ముందు చిరంజీవికి ఫోన్ చేసి, ‘ఈ సినిమా ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు విడుదల చేస్తే ఫీల్ అవుతారేమో’ అని అడిగానని అన్నారు. దానికి చిరు కూల్‌గా స్పందిస్తూ.. మీ సినిమా మీ ఇష్టం. అది విడుదల చేస్తే నేనెందుకు ఫీల్ అవుతా అని అన్నారట. పైగా ఆ మూవీకి ఆల్‌ ది బెస్ట్ అని కూడా చెప్పారట చిరు. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న శ్రీధర్.. మెగాస్టార్‌పై వచ్చినవన్ని రూమర్లేనని కొట్టిపారేశారు. కాగా చిరు కుమార్తెతో నిశ్చితార్ధం క్యాన్సిల్ తరువాత ఉదయ్ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలను చిరు సన్నిహితులు కూడా నిర్మించారు. ఏదేమైనా ఉదయ్ హఠాన్మరణం మాత్రం టాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా బాధించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు.

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?