విజయ్‌పై నా ఫీలింగ్స్ పర్మినెంట్‌గా ఉంటాయి: జాన్వీ

విజయ్ దేవరకొండ అలియాస్ రౌడీ. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలో తనకంటూ.. ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు తన సినిమా వస్తుందంటే.. స్టార్‌ హీరోయిలు కూడా సినిమా ఆపి విడుదల చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా.. అమ్మాయిలకు కూడా ఫెవ్‌రెట్ రౌడీగా మారిపోయాడు అర్జున్ రెడ్డి. చిన్నవయసులోనే ఫోర్బ్స్‌లో సైతం స్థానం సంపాదించుకున్నాడు డియర్ కామ్రెడ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నేర్పుతో ప్రతీ సందర్భంలోనూ విజయ్ వ్యవహరిస్తూంటాడు. కాగా.. ప్రస్తుతం ఇప్పుడు […]

విజయ్‌పై నా ఫీలింగ్స్ పర్మినెంట్‌గా ఉంటాయి: జాన్వీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 26, 2019 | 3:52 PM

విజయ్ దేవరకొండ అలియాస్ రౌడీ. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలో తనకంటూ.. ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు తన సినిమా వస్తుందంటే.. స్టార్‌ హీరోయిలు కూడా సినిమా ఆపి విడుదల చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా.. అమ్మాయిలకు కూడా ఫెవ్‌రెట్ రౌడీగా మారిపోయాడు అర్జున్ రెడ్డి. చిన్నవయసులోనే ఫోర్బ్స్‌లో సైతం స్థానం సంపాదించుకున్నాడు డియర్ కామ్రెడ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నేర్పుతో ప్రతీ సందర్భంలోనూ విజయ్ వ్యవహరిస్తూంటాడు. కాగా.. ప్రస్తుతం ఇప్పుడు అతని హవా బాలీవుడ్‌కి పాకింది. స్టార్స్ హీరోయిన్స్‌ కూడా విజయ్‌‌కి అభిమానుల్లా మారిపోయారు. అందులో ఒకరు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.

ఇదివరకు పలు షోల్లో విజయ్‌పై పొగడ్తల వర్షం కురిపించిన జాన్వీ.. తాజాగా ఓ రియాల్టీ టాక్‌షోలో అతని పట్ల ఆమెకున్న అభిమానాన్ని మరోసారి చాటుకుంది. ‘విజయ్ దేవరకొండ తన ఆల్‌టైమ్ క్రష్ అని.. అతడిని చూస్తే ముచ్చటగా అనిపిస్తుందని, తనకు తెలిసి ఇది వన్‌సైడ్ మాత్రమేనంది. తన అభిప్రాయాలు కాలానుగుణంగా మారుతూంటాయి. కానీ.. విజయ్‌పై మాత్రం తన ఫీలింగ్స్ పర్మినెంట్‌గా ఉంటాయని ప్రశంసలు కురిపించింది. అందులోనూ విజయ్ కెరీర్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. విజయ్‌పై తనకున్న ఇష్టం సురక్షితమైన జోన్‌లో ఉందని.. అందుకే ఇలా పబ్లిక్‌గా మాట్లాడుతున్నా అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.