AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాహుబలి నిర్మాతల కొత్త ప్రాజెక్ట్.. మలయాళ రీమేక్‌తో..!

బాహుబలిని నిర్మించి టాలీవుడ్‌ స్థాయిని ప్రపంచదేశాలకు చాటిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు.. దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు. కంటెంట్ ఉన్న కథలపైనే ఆసక్తి చూపుతున్న ఈ నిర్మాతలు తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మలయాళంలో విజయం సాధించిన మహేశింతే ప్రతీకారమ్ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు ఈ నిర్మాతలు. మహాయాన మోషన్‌ పిక్చర్స్ బ్యానర్‌తో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ […]

బాహుబలి నిర్మాతల కొత్త ప్రాజెక్ట్.. మలయాళ రీమేక్‌తో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 6:09 PM

Share

బాహుబలిని నిర్మించి టాలీవుడ్‌ స్థాయిని ప్రపంచదేశాలకు చాటిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు.. దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు. కంటెంట్ ఉన్న కథలపైనే ఆసక్తి చూపుతున్న ఈ నిర్మాతలు తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మలయాళంలో విజయం సాధించిన మహేశింతే ప్రతీకారమ్ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు ఈ నిర్మాతలు. మహాయాన మోషన్‌ పిక్చర్స్ బ్యానర్‌తో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ రీమేక్‌కు కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తుండగా ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ చిన్నపాటి టీజర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే కొత్త లుక్‌లో వచ్చినప్పటికీ.. ఎప్పటిలాగే తన సహజ నటనతో సత్యదేవ్ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు జబర్దస్త్ రాంప్రసాద్, సుహాస్, టీఎన్ఆర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. బిజ్‌పాల్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే చిన్న బడ్జెట్‌లోనే వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం.

Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!