జగన్‌పై ఆగ్రహంగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి వర్గం
ఒంగోలు: వైసీపీ పార్టీలో అసమ్మతి నాయకులు పలు రకాలుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ సీటు తనకు కేటాయించలేదన్న కోపంలో వైవీ సుబ్బారెడ్డి అలకమీద ఉన్నారు. 2014లో టీడీపీ అభ్యర్ధి అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి గెలిపొందారు. అలాంటిది సుబ్బారెడ్డిని కాదని అదే మాగుంటకు జగన్ టికెట్ ఇవ్వడంపై వైవి సుబ్బారెడ్డి వర్గం ఆగ్రహంగా ఉంది. మాగుంటకు టికెట్ ఇవ్వనున్న విషయం తెలిసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు సుబ్బారెడ్డి దూరంగా ఉంటున్నారు. తాడేపల్లిలో […]

ఒంగోలు: వైసీపీ పార్టీలో అసమ్మతి నాయకులు పలు రకాలుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ సీటు తనకు కేటాయించలేదన్న కోపంలో వైవీ సుబ్బారెడ్డి అలకమీద ఉన్నారు. 2014లో టీడీపీ అభ్యర్ధి అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి గెలిపొందారు. అలాంటిది సుబ్బారెడ్డిని కాదని అదే మాగుంటకు జగన్ టికెట్ ఇవ్వడంపై వైవి సుబ్బారెడ్డి వర్గం ఆగ్రహంగా ఉంది. మాగుంటకు టికెట్ ఇవ్వనున్న విషయం తెలిసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు సుబ్బారెడ్డి దూరంగా ఉంటున్నారు.
తాడేపల్లిలో జగన్ గృహ ప్రవేశానికి కూడా హాజరుకాలేదు. ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ ప్రచార సభకు కూడా హాజరు కాలేదు. మాగుంట వర్గం మర్యాదపూర్వకంగానైనా వైవీ సుబ్బారెడ్డిని పిలవకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారినట్టు కనిపిస్తోంది. మరి ఈ అంశం ఎంత దూరం వెళుతుందో, ఎలా పరిణమిస్తుందో అన్న ఆసక్తి ఎక్కువైంది. అయితే జగన్ ఢిల్లీ పర్యటనలో సడెన్‌గా ప్రత్యక్షమైన సుబ్బారెడ్డిని చూసి అంతా సద్దుమణిగినట్టుగా ఉందని భావవించారు. కానీ ఎప్పుడైతే మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి సుబ్బారెడ్డి మళ్లీ కామ్ అయిపోయారు.