టార్గెట్‌గా ఏపీ రాజధాని: వైసీపీ, టీడీపీ మీటింగులు..!

టార్గెట్‌గా ఏపీ రాజధాని: వైసీపీ, టీడీపీ మీటింగులు..!

ప్రస్తుతం ఏపీ రాజధాని.. ఏదనేదానిపై.. వైసీపీ, టీడీపీ పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ పార్టీకి ఆ పార్టీనే.. తక్కువేం కాదని..  రెండు విపక్షాలూ.. పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో.. ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు దేశం పార్టీ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అటు వైసీపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఈ సమావేశానికి టీడీపీ ఆహ్వానించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. రాజధానిపై పోరాటం ఉధృతం చేస్తోంది టీడీపీ. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 05, 2019 | 8:43 AM

ప్రస్తుతం ఏపీ రాజధాని.. ఏదనేదానిపై.. వైసీపీ, టీడీపీ పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ పార్టీకి ఆ పార్టీనే.. తక్కువేం కాదని..  రెండు విపక్షాలూ.. పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో.. ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు దేశం పార్టీ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అటు వైసీపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఈ సమావేశానికి టీడీపీ ఆహ్వానించింది.

అసెంబ్లీ సమావేశాలకు ముందే.. రాజధానిపై పోరాటం ఉధృతం చేస్తోంది టీడీపీ. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజా రాజధాని ద్వారా సంపద సృష్టించి, పేదరికాన్ని నిర్మూలించొచ్చని టీడీపీ చెబుతోంది. ఇదే అంశంపై వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

మరోవైపు వైసీపీ కూడా రాజధాని నిజ స్వరూపం పేరిట ఇవాళ తుళ్లూరులో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఉదయం 11 గంటలకు వివిధ పార్టీల నేతలు, తుళ్లూరు వాసులతో సమావేశమవుతోంది. గతంలో రాజధాని పేరిట జరిగిన మోసాన్ని సమావేశంలో చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu