Ex CM Nallari Kiran Kumar Reddy: నల్లారి సెకండ్ ఇన్నింగ్స్‌కి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు

తెలుగు రాజకీయాల్లో ఆయనది క్రియాశీలక పాత్ర.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి.. తెలంగాణ వచ్చిన తరువాత పెద్దగా కనిపించని ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్

Ex CM Nallari Kiran Kumar Reddy: నల్లారి సెకండ్ ఇన్నింగ్స్‌కి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు
Nallari Kiran Kumar Reddy

Edited By:

Updated on: Oct 26, 2021 | 6:07 PM

Nallari Kiran Kumar Reddy: తెలుగు రాజకీయాల్లో ఆయనది క్రియాశీలక పాత్ర.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి. తెలంగాణ వచ్చిన తరువాత పెద్దగా కనిపించని ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వనున్నారా? సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇంతకీ ఎవరాయన? అంటే.. చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రముఖ కుటుంబాలలో ఆయన కుటుంబానికి ప్రత్యేక స్థానం. తండ్రి ఆమర్నాధ్ కి ఉన్న పలుకుబడితో వాయం పాడు, పీలేరు నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. పొలిటికల్ గా ఎదిగారు. చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా తనకంటూ ప్రత్యేక స్థానం ను సంపాదించారు ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ..రాష్ట్ర విభజన సమయంలో సర్వ శక్తులు ఒడ్డి విభజన ఆపాలని ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ దెబ్బకు సైలెంట్ అయిపోయారు .. సొంతంగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టి తిరిగిన సక్సెస్ కాలేకపోయారు అజ్ఞాతంలో కి వెళ్లిపోయారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అయితే కొంత కాలం తరువాత అయిన మళ్ళీ అక్టీవ్ అవుతున్నారు అన్నా వార్తలు వొచ్చాయి దానికి తగ్గట్టుగానే బీజేపీ సీనియర్ నేతలు ఆయన తో సంప్రధింపులు జరిపారు కానీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లోనే జాయిన్ అయ్యరు నల్లారి ..అడపడదపా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు కానీ ఇక్కడ కూడా తన మార్క్ చూపించలేదు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో మళ్ళీ క్రియాశీల పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది కొన్ని రోజుల నుండి ఆయనకు Ap పిసిసి పగ్గాలు అప్పజెప్పుతారని వార్తలు వొచ్చిన ఆయన ఆ పదవీ చేపట్టడానికి సుముఖంగా లేరట ..ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గాని సిడబ్ల్యుసి మెంబర్ గాని సౌత్ కాంగ్రెస్ ఇంచార్జ్ పదవి గాని ఇవ్వాలని పట్టు బడుతున్నారట ..దీనికి అధిష్టానం కూడా సుముఖత వ్యక్తం చేసి నట్లు తెలుస్తుంది ఢిల్లీ లో సోనియా అధ్యక్షతన జరుతున్న పిసిసి ల మీటింగ్ తరువాత దీని పైన ఒక క్లారిటి వొచ్చే అవకాశం ఉందట.

Read also:  Chandrababu: చంద్రబాబుకు దొరకని అమిత్ షా అపాయింట్మెంట్.. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం