Kerala: కేరళలో అణు విద్యుత్ కేంద్రం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్రం..!

కేరళలో ఇటీవలి ఇంధన డిమాండ్ 4260 మెగావాట్లు కాగా, 2030 నాటికి అది 10 వేల మెగావాట్లకు చేరుతుందని ఆ రాష్ట్రం అంచనా వేస్తోంది. కేరళ రాష్ట్రంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోరింది. విద్యుత్ లోటును అధిగమించడానికి రాష్ట్రంలోని ఖనిజ నిక్షేపాలను వినియోగించుకుని న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.

Kerala: కేరళలో అణు విద్యుత్ కేంద్రం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్రం..!
Nuclear Power Station
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 25, 2024 | 10:54 AM

దక్షిణ భారతంలో మరో అణు విద్యుత్ కేంద్ర రాబోతుంది. కేరళలో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరు కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ , రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కె. కృష్ణకుట్టి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చర్చల సమయంలో, కేరళలో అణుశక్తి కేంద్రాన్ని నిర్మించాలని సూచించినట్లు సమాచారం. కేరళ రాష్ట్రంలోని థోరియం నిక్షేపాలను వినియోగించి, దాని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కేరళకు ఇవ్వాలని సమావేశంలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్‌ను మంజూరుచేసే ఆలోచనకు సిద్ధంగా ఉందని.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరిస్తే న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని మనోహర్ లాల్ ఖట్టర్‌ సూచించినట్లు పేర్కొన్నాయి.

కేరళలో ఇటీవలి ఇంధన డిమాండ్ 4,260 మెగావాట్లు కాగా, 2030 నాటికి అది 10 వేల మెగావాట్లకు చేరుతుందని ఆ రాష్ట్రం అంచనా వేస్తోంది. విద్యుత్‌ లోటును ఎదుర్కొంటున్న కేరళ ఇప్పటికే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోంది. దీన్ని అధిగమించడం కోసం రాష్ట్రంలోని ఖనిజ నిక్షేపాలను వినియోగించుకుని న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కోరింది. అయితే, కేరళలోని థోరియం నిక్షేపాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలని మాత్రమే సూచించిందని రాష్ట్ర విద్యుత్ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఈ సమావేశం గురించి కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే.. రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయినప్పటికీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్‌లోని అన్ని ఓవర్ హెడ్ విద్యుత్ కేబుళ్లను భూగర్భంలోకి మార్చాలన్న డిమాండ్‌ను కేరళ సర్కార్ కేంద్ర మంత్రి ముందు ఉంచింది. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ఇది అవసరమని కేరళ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా తాల్చేర్ పవర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి 180 మెగావాట్లకు బదులు 400 మెగావాట్ల విద్యుత్ అందించాలని కేరళ మంత్రి కృష్ణకుట్టి కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను జాతీయ ఆస్తిగా ప్రకటించాలని మరియు దాని ఖర్చులను అన్ని రాష్ట్రాల నుండి తీసుకోవాలని కేరళ డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?