Revant Reddy meet VH: సీనియర్ నేత వీహెచ్ సలహాలతో ముందుకు వెళ్తా..
ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతలను కలిసే పనిలో పడ్డారు. తాజాగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావును పరామర్శించారు.
కొత్తగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి పార్టీ ప్రక్షాళన ఎక్కడినుంచి మొదలుపెట్టబోతున్నారన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతలను కలిసే పనిలో పడ్డారు. తాజాగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావును పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ… సీనియర్ నేత వి.హనుమంతరావు సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని… వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని అన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడిందని అన్నారు.
హాస్పిటల్‌లో ఉన్నా.. ప్రజా సమస్యలపైనే ఆయన దృష్టి అని అన్నారు. వాటిపై తనతో చర్చించారని తెలిపారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్‌గా ఉన్నారని…అయితే రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని తనకు వీహెచ్ సూచించారని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని మేడమ్ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మేడమ్ సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.