కమల ప్రచారంలో ఖలి.. ఈసీకి ఫిర్యాదు చేసిన టీఎంసీ

బీజేపీ తరపున రెజ్లర్ ది గ్రేట్ ఖలి ప్రచారం చేయడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఖలి పౌరసత్వ హోదాపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదులో పేర్కొంది. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉందని.. ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక విదేశీయుడిని అనుమతించరాదని ఈసీని ఆ లేఖలో పేర్కొంది. ఖలి తన స్నేహితుడు, బీజేపీ జాదవ్ పూర్ ఎంపీ అభ్యర్ధి అనుపమ్ హజ్రా తరపున ప్రచారం […]

కమల ప్రచారంలో ఖలి.. ఈసీకి ఫిర్యాదు చేసిన టీఎంసీ
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2019 | 3:27 PM

బీజేపీ తరపున రెజ్లర్ ది గ్రేట్ ఖలి ప్రచారం చేయడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఖలి పౌరసత్వ హోదాపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదులో పేర్కొంది. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉందని.. ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక విదేశీయుడిని అనుమతించరాదని ఈసీని ఆ లేఖలో పేర్కొంది. ఖలి తన స్నేహితుడు, బీజేపీ జాదవ్ పూర్ ఎంపీ అభ్యర్ధి అనుపమ్ హజ్రా తరపున ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం చేస్తూ బీజేపీ అభ్యర్ధికి ఓటు వేయాలంటూ ప్రజలను కోరారు. హజ్రా బెంగాల్ నటి టీఎంసీ అభ్యర్ధి చక్రవర్తిపై హజ్రా పోటీ చేస్తున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు మూడు విడతలు ఎన్నికలు జరుగగా.. తక్కిన నాలుగు విడతల పోలింగ్ ఈ నెల 29, మే 6,12,19లలో జరుగనున్నాయి.