తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే పేరిట తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తాము సర్వే చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ హరిప్రసాద్ ఆరోపించారు. ఈ ప్రచారం చేస్తోన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎఫ్‌సీ మీడియా, వీరపనేని రామకృష్ణ నేతృత్వంలోని మ్యాంగో అండ్ వాక్డ్ ఔట్, అదుగాని మల్లేశ్ నేతృత్వంలోని ఛాలెంజ్ మిత్ర, చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని టాలీవుడ్ నగర్ అనే యూట్యూబ్ ఛానల్‌లు ఈ ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తున్నట్లు […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తాము సర్వే చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ హరిప్రసాద్ ఆరోపించారు. ఈ ప్రచారం చేస్తోన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎఫ్‌సీ మీడియా, వీరపనేని రామకృష్ణ నేతృత్వంలోని మ్యాంగో అండ్ వాక్డ్ ఔట్, అదుగాని మల్లేశ్ నేతృత్వంలోని ఛాలెంజ్ మిత్ర, చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని టాలీవుడ్ నగర్ అనే యూట్యూబ్ ఛానల్‌లు ఈ ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తున్నట్లు హరిప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఫిర్యాదుతో పాటు వాటికి సంబంధించిన యూట్యూబ్ లింకులు, అందులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన వీడియోలను ఆయన పోలీసులకు అందజేశారు. దీంతో ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై ఐపీసీ సెక్షన్ 71 (సీ), రెడ్‌విత్, 171 (ఎఫ్), 171 (జీ), 417, 420, 465, 468, 471, 505(1), (సీ), 505(2), రెడ్‌విత్ 120(బీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66(డీ) కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.