టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులపై వరాల జల్లు!

సార్వత్రిక ఎన్నికల వేళ‌ ఉద్యోగులపై తెలుగుదేశం పార్టీ వరాల జ‌ల్లు కురిపిస్తోంది. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయనుంది. ఈ క్రమంలో పార్టీ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు చేర్చుతున్నట్లు తెలిపింది. ఇందులో కీలకమైంది… ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం కేటాయింపు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్నా… ప్రస్తుతకాలంలో ఇంటి స్థలం కొనుక్కోలేని దుస్థితి ఉద్యోగుల్లో నెలకొంది. అందుకే సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగికీ ఇంటిస్థలం కేటాయిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. 25-35 ఏళ్ల సర్వీసు ఉన్న ప్రతి […]

టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులపై వరాల జల్లు!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 3:01 PM

సార్వత్రిక ఎన్నికల వేళ‌ ఉద్యోగులపై తెలుగుదేశం పార్టీ వరాల జ‌ల్లు కురిపిస్తోంది. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయనుంది. ఈ క్రమంలో పార్టీ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు చేర్చుతున్నట్లు తెలిపింది. ఇందులో కీలకమైంది… ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం కేటాయింపు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్నా… ప్రస్తుతకాలంలో ఇంటి స్థలం కొనుక్కోలేని దుస్థితి ఉద్యోగుల్లో నెలకొంది. అందుకే సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగికీ ఇంటిస్థలం కేటాయిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. 25-35 ఏళ్ల సర్వీసు ఉన్న ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం కేటాయించే విధానం అమల్లోకి రానుంది.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేస్తామంటోంది. ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇప్పటికే పాలసీ తెచ్చినందున, దానిని వెంటనే అమలు చేస్తామని హామీ ఇస్తోంది. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉండే ప్రభుత్వ స్థలాలను ఉద్యోగులకు కేటాయిస్తుంది. ప్రభుత్వ భూములు లేకపోతే ప్రైవేట్‌ స్థలాలు కొనుగోలు చేసి ఇవ్వనున్నట్లు టీడీపీ తెలిపింది.