తెలుగుదేశం ఎంపీ లిస్ట్ ఫైనల్..

| Edited By:

Mar 19, 2019 | 6:49 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ వార్ మొదలైంది. అన్నీ ప్రధాన పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల లిస్టును ప్రకటించాయి. దీంతో.. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏపీలో చంద్రబాబు, జగన్ వరుస సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల సమరానికి సిద్ధమైంది. కాగా.. తెలుగుదేశం పార్టీ 25 ఎంపీ స్థానాలు, పెండింగ్‌లో ఉన్న 35 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ పవన్ రెడ్డి, తిరుపతి – […]

తెలుగుదేశం ఎంపీ లిస్ట్ ఫైనల్..
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ వార్ మొదలైంది. అన్నీ ప్రధాన పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల లిస్టును ప్రకటించాయి. దీంతో.. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏపీలో చంద్రబాబు, జగన్ వరుస సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల సమరానికి సిద్ధమైంది.

కాగా.. తెలుగుదేశం పార్టీ 25 ఎంపీ స్థానాలు, పెండింగ్‌లో ఉన్న 35 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ పవన్ రెడ్డి, తిరుపతి – పనబాకలక్ష్మీ, నంద్యాల – విజయవాడ కేశినేని నాని, ఒంగోలు – సిద్ధా రాఘవరావు, గుంటూరు – గల్లా జయదేవ్ పేరును ప్రకటించారు.

ఇక పార్టీపై అలకగా ఉన్న రాయపాటి సాంబశివరావుకు ఎట్టకేలకు మళ్లీ నర్సాపూర్ టికెట్ సాధించారు. రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ పోటీ చేసేందుకు విముఖత చూపడంతో అదే సామాజిక వర్గానికి చెందిన, ఆయన కోడలు మాగంటి రూపకు ఆ సీటు ఇచ్చారు. ఇక పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. మొత్తం 36 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.