Lokesh: ‘మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా..’ రమ్య హత్య ఉదంతంపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
గుంటూరు యువతి రమ్య హత్య ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా.. రమ్యని చంపేసిన 12 గంటల తర్వాత
Ramya Murder – Nara Lokesh: గుంటూరు యువతి రమ్య హత్య ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా.. రమ్యని చంపేసిన 12 గంటల తర్వాత బాధాకరం అంటూ ట్వీట్ చేశారు’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. ‘నిద్ర మొఖం పాలనలో ఎంతమంది అమ్మాయిలను బలి చేస్తారు’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి @ysjagan గారూ! మధ్యాహ్నమే నిద్రపోతున్నారా? రమ్యని చంపేసిన 12 గంటల తరువాత బాధాకరం అంటూ ట్వీటేశారు. మీ నిద్రమొఖం పాలనతో ఇంకెంతమంది అమ్మాయిల్ని బలి చేస్తారు? pic.twitter.com/CZp2woOsO8
— Lokesh Nara (@naralokesh) August 15, 2021
కాగా, రమ్య హత్య జరిగిన అనంతరం లోకేష్ ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘దిశ’ చట్టం అంటూ జగన్ రెడ్డి గారు బిగ్గరగా అరవడం.. వైకాపా బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు లోకేష్. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారు? అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే, ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని లోకేష్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి గారు దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే గుంటూరులో దళిత యువతి రమ్యని అత్యంత కిరాతకంగా హత్య చేసాడు మృగాడు. అంటూ లోకేష్ అన్నారు.
ఉన్నత విద్యనభ్యసిస్తూ బంగారు భవిష్యత్తు ఉన్న రమ్య ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్యని హత్య చేసిన మృగాడికి కఠిన శిక్ష పడాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.
Read also: Ramya Murder: రమ్యను హత్య చేసిన శశికృష్ణను అరెస్ట్ చేశాం.. కఠినంగా శిక్షిస్తాం : డీజీపీ గౌతమ్ సవాంగ్