AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ బుజ్జగింపులకు బెట్టువీడని ఎస్పీవై రెడ్డి

నంద్యాల ఎంపీ, మాజీ టీడీపీ నేత, ప్రస్తుత జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నించినా అందుకు ఆయన అంగీకరించలేదు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ గురువారం ఆయనతో నంద్యాలలో భేటీ అయ్యారు. ఎస్పీవైరెడ్డి కుటుంబం టీడీపీకి మద్దతు ఇవ్వాలని, సీఎం ఇచ్చిన ఎమ్మెల్సీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీ కోరినట్లు తెలిసింది. పరిశ్రమల రుణాల వెసులుబాటుతో మరో విధంగా న్యాయం చేస్తామని టీజీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఎస్పీవైరెడ్డి ఆ […]

టీడీపీ బుజ్జగింపులకు బెట్టువీడని ఎస్పీవై రెడ్డి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 29, 2019 | 7:12 PM

Share

నంద్యాల ఎంపీ, మాజీ టీడీపీ నేత, ప్రస్తుత జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నించినా అందుకు ఆయన అంగీకరించలేదు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ గురువారం ఆయనతో నంద్యాలలో భేటీ అయ్యారు. ఎస్పీవైరెడ్డి కుటుంబం టీడీపీకి మద్దతు ఇవ్వాలని, సీఎం ఇచ్చిన ఎమ్మెల్సీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీ కోరినట్లు తెలిసింది. పరిశ్రమల రుణాల వెసులుబాటుతో మరో విధంగా న్యాయం చేస్తామని టీజీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఎస్పీవైరెడ్డి ఆ పదవేదో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారికి ఇచ్చి తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.

ప్రజల మద్దతు తమకే ఉందని ఎస్పీవై రెడ్డి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రయత్నాలు సీట్లు ఖరారు చేసే సమయంలో ఎందుకు చేయలేదని ఎస్పీవై రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయనతో చర్చలు ఫలించకపోవడంతో టీజీ వెంకటేశ్‌ నిరాశతో వెనుదిరిగారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, నంద్యాల అసెంబ్లీకి ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి, బనగానపల్లెలో కుమార్తె అరవిందరాణి పోటీలో నిలిచారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?