బెంగాల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. బీజేపీలో మరో సీనియర్ నేత చేరారు. ఆయనే బీజేపీ నేత సువెందు అధికారి తండ్రి శిశిర్ అధికారి. ఆదివారం ఆయన పూర్బా మెడినిపూర్ లోని ఎగ్రా లో హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో కమలం పార్టీలో చేరారు. ‘అత్యాచారాల నుంచి బెంగాల్ ను రక్షించండి’ అంటూ కొద్దిసేపు ప్రసంగించిన ఆయన. ‘జైశ్రీరామ్’ నినాదంతో తన స్పీచ్ ముగించారు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతగా ఉండి, ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ లో ఏళ్లపాటు కొనసాగి చివరకు బీజేపీలో చేరారు. తన కుమారుడు సువెందు అధికారి ఈ పార్టీలో ఎప్పుడో చేరగా,, ఈయన కూడా చేరుతారో లేదో అన్న ఊహాగానాలకు తెర దించుతూ నేడు కాషాయ కండువా కప్పుకున్నారు. మెడినిపూర్, బంకూరా, పురూలియా జిల్లాల్లో 30 కి పైగా స్థానాల్లో అధికారి కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ సీట్లు ఈ ఎన్నికల్లో బీజేపీకి వెళ్లవచ్ఛు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఆరేళ్ళ పాటు మంత్రిగా వ్యవహరించిన శిశిర్ అధికారి.. ఆ తరువాత 23 ఏళ్ళు తృణమూల్ కాంగ్రెస్ లో కొనసాగారు.
టీఎంసీ నేతలు తనను బీజేపీలో చేరవలసిందిగా ఒత్తిడి చేశారని, వారేం కోరుకున్నారో చేయనివ్వండని, తాను కోరుకున్నది తను చేస్తానని ఆయన అంతకుముందు చెప్పారు. సువెందు అధికారి బీజేపీలో చేరిన అనంతరం ఆయన సోదరుడు సౌమెందు అధికారి కూడా బీజేపీలో చేరారు. ఇప్పుడు వీరి తండ్రి శిశిర్ అధికారి కూడా ఈ పార్టీలో చేరడంతో దాదాపు కుటుంబమంతా కమలానికి జై కొట్టింది. ఇక ఈయన మరో కుమారుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన దివ్యేన్డు అధికారి కూడా బీజేపీలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగాల్ లో తృణమూల్ నుంచి మరికొందరు నేతలు కూడా కమలం పార్టీలో చేరవచ్చునని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Param Bir Singh Vs Anil Deshmukh : నెలకు 100 కోట్లు వచ్చి పడాలనేది హోంమంత్రి మౌఖిక ఆదేశాల్లోని సారాంశమట.!