కలకలం రేపుతున్న ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముసలం ఏర్పడింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పృథ్విరాజ్ మీనా చేసిన వ్యాఖ్యలు.. కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌ను నియమించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందినందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బాధ్యత వహించి తన పదవి నుంచి తప్పుకోవాలని పృథ్విరాజ్ కోరారు. దీంతో ఆయన మాటలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. రాజస్థాన్‌లో 25 […]

కలకలం రేపుతున్న ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 05, 2019 | 8:52 PM

రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముసలం ఏర్పడింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పృథ్విరాజ్ మీనా చేసిన వ్యాఖ్యలు.. కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌ను నియమించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందినందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బాధ్యత వహించి తన పదవి నుంచి తప్పుకోవాలని పృథ్విరాజ్ కోరారు. దీంతో ఆయన మాటలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా బీజేపీ అన్నింట్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.