వ్యాపారులపై మోదీ వరాలజల్లు

| Edited By:

Apr 20, 2019 | 11:02 AM

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎటువంటి పూచీకత్తు లేకుండా వ్యాపారులకు రూ.50 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. చిన్నపాటి దుకాణదారులకు క్రెడిట్‌ కార్డు, పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం గత అయిదేళ్లలో 1,500 పాత చట్టాలను రద్దు చేసి వ్యాపారులకు ఉపశమనం కలిగించడంతో పాటు వ్యాపారాలను సరళం చేసిందని పేర్కొన్నారు. వ్యాపారులను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించిన మోదీ… గతంలో వారికి ఎప్పుడూ సరైన గౌరవం లభించలేదని చెప్పారు. వారి […]

వ్యాపారులపై మోదీ వరాలజల్లు
Follow us on

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎటువంటి పూచీకత్తు లేకుండా వ్యాపారులకు రూ.50 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. చిన్నపాటి దుకాణదారులకు క్రెడిట్‌ కార్డు, పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం గత అయిదేళ్లలో 1,500 పాత చట్టాలను రద్దు చేసి వ్యాపారులకు ఉపశమనం కలిగించడంతో పాటు వ్యాపారాలను సరళం చేసిందని పేర్కొన్నారు.

వ్యాపారులను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించిన మోదీ… గతంలో వారికి ఎప్పుడూ సరైన గౌరవం లభించలేదని చెప్పారు. వారి సహకారం లేకుండా ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడం సాధ్యం కాదని విన్నవించారు. తిరిగి అధికారంలోకి రాగానే జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాను ‘మాలిక్‌’ను కాదని ‘సేవక్‌’ని అంటూ గత ఐదేళ్లలో తన ప్రభుత్వ విజయాలను వివరించారు.