Pawan Kalyan: వైసీపీ సర్కార్‌కు వారం డెడ్‌లైన్ విధించిన జనసేనాని.. చెవుల్లో క్యాబేజీలు పెట్టకండి అంటూ పంచ్‌

|

Oct 31, 2021 | 7:08 PM

వైసీపీకి డెడ్‌లైన్ విధించారు జనసేనాని. వారం టైమ్ ఇస్తున్నా.. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించండి. లేదంటే మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు.

Pawan Kalyan: వైసీపీ సర్కార్‌కు వారం డెడ్‌లైన్ విధించిన జనసేనాని.. చెవుల్లో క్యాబేజీలు పెట్టకండి అంటూ పంచ్‌
Pawan Kalyan
Follow us on

వైసీపీకి డెడ్‌లైన్ విధించారు జనసేనాని. వారం టైమ్ ఇస్తున్నా.. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించండి. లేదంటే మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు. వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం.. అండగా నిలబడుతాం అంటూ వైసీపీ చెప్పే మాటల్ని నమ్మం అన్నారు పవన్. మీరు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. వైసీపీ మాటలకు అర్థాలే వేరంటూ సెటైర్లు పేల్చారు జనసేనాని. వైసీపీ నాయకులకు ప్రజలు అవసరం లేదు.. డబ్బులు కాంట్రాక్టులే కావలంటూ విమర్శించారు పవన్.

ఇప్పటి వరకు చెప్పింది చాలు.. చాలా విన్నాం…! ఇంకా మా చెవుల్లో క్యాబేజీలు పెట్టకండి అంటూ పంచ్‌లు విసిరారు పవన్. అన్ని పరిశ్రమలు, సంస్థలకు నష్టాలు, అప్పులు ఉన్నాయి.. ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అన్నారు జనసేనాని. సొంత గ‌నులు కేటాయిస్తే విశాఖ స్టీల్‌కు న‌ష్టాలు త‌గ్గుతాయ‌ని అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గ‌నులు కేటాయించాల‌ని ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడ‌గ‌ర‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రశ్నించారు. త‌న‌కు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే బ‌లం కూడా లేదు, గెలిచిన ఒక్క ఎమ్మెల్యేనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప‌ట్టుకుపోయారని చెప్పారు. కానీ విశాఖ స్టీల్ ప్రైవేటీక‌రించొద్ద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశామ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. నా సభలకు జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం వాళ్లకు వేస్తారు. మీకు వైసీపే కరెక్ట్ అంటూ సభకు వచ్చిన జనాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్.

Also Read:. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !

‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె