ఖమ్మంలో టీడీపీకి షాక్.. టీఆర్‌ఎస్‌లోకి నామా

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్.. తమ పార్టీలోకి రావాలని నామాను ఆహ్వానించినట్లు సమాచారం. ఇక సోమవారం నామా నాగేశ్వరరావు ఫాంహౌస్‌కు వెళ్లి తన చేరికపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు నామా రాక ఖరారు కావడంతో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి ఆయనను పోటీకి దింపే యోచనలో టీఆర్ఎస్ […]

ఖమ్మంలో టీడీపీకి షాక్.. టీఆర్‌ఎస్‌లోకి నామా
Nama Nageswara Rao
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Vijay K

Updated on: Mar 20, 2019 | 8:47 AM

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్.. తమ పార్టీలోకి రావాలని నామాను ఆహ్వానించినట్లు సమాచారం. ఇక సోమవారం నామా నాగేశ్వరరావు ఫాంహౌస్‌కు వెళ్లి తన చేరికపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు నామా రాక ఖరారు కావడంతో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి ఆయనను పోటీకి దింపే యోచనలో టీఆర్ఎస్ ఉందని ప్రచారం జరుగుతోంది.