KK – Etela Rajender: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. వైరల్‌గా మారిన ఈటల, కేకే పలకరింపు..

| Edited By: Ravi Kiran

Dec 14, 2021 | 11:30 AM

ఆయనంటే హైకమాండ్‌కు అస్సలు పడదు. కానీ కొందరు నేతలు మాత్రం ఫ్రెండ్‌షిప్‌ను వదులుకోలేక పోతున్నారు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లు మారింది టీఆర్ఎస్ నేతల పరిస్థితి.

KK - Etela Rajender: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. వైరల్‌గా మారిన ఈటల, కేకే పలకరింపు..
Kk With Etela Rajender
Follow us on

KK – Etela Rajender: ఆయనంటే హైకమాండ్‌కు అస్సలు పడదు. కానీ కొందరు నేతలు మాత్రం ఫ్రెండ్‌షిప్‌ను వదులుకోలేక పోతున్నారు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లు మారింది టీఆర్ఎస్ నేతల పరిస్థితి. అటు ఈ పరిణామాలపై హైకమాండ్ కూడా కాస్త అసంతృప్తితో ఉందట. తెలంగాణ రాజకీయాల్లో ఈటల ఎపిసోడ్ ఓ హాట్‌టాఫిక్. భూముల కొనుగోళ్లలో ఆయనపై ఆరోపణలు రావడం..కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలకడం.. ఆ తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం.. బైపోల్‌లో గెలవడం జరిగిపోయాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌తోపాటు ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు ఈటల రాజేందర్. అటు టీఆర్ఎస్‌ నుంచి కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు వచ్చాయి.

అయితే సుదీర్ఘకాలం టీఆర్ఎస్‌లో ఉన్న ఈటలకు ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. ఇటీవల కొన్ని సందర్భాల్లో టీఆర్ఎస్‌ లీడర్లు ఈటలను ఆప్యాయంగా పలకరించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి కుమారుడి వివాహానికి ఈటెల వచ్చారు. టీఆర్ఎస్‌ నుంచి కూడ కొందరు లీడర్లు హాజరయ్యారు.

ఇక్కడే టీఆర్ఎస్‌లో కీలక నేత కేకే ఈటలను పలకరించడం..ఆయనో అప్యాయంగా మాట్లాడటం వైరల్‌గా మారింది. ఇలాంటి దృశ్యాలతో హైకమాండ్ కొంత ఇబ్బంది గురవుతోంది. అయినా నేతలు మాత్రం తమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. కేకే-ఈటల పలకరించుకున్న దృశ్యాలు పార్టీలో సైతం చర్చకు దారితీస్తున్నాయి.

అటూ టీఆర్ఎస్‌ పార్టీలోని ముఖ్య నేతలు కూడా వాళ్ళ ఇళ్ళలో జరిగే వివాహాలకు ఈటలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల తన కూతురు పెళ్లికి వచ్చిన ఈటలను కౌగిలించుకొని కొద్దిసేపు పిచ్చాపాటిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడారు.

ఓవైపు సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్. ఆయనతో దూరం పాటించాల్సింది పోయి సన్నిహితంగా మెలగడంపై అధిష్టానం కూడా అసంతృప్తితో ఉందట.

ఇవి కూడా చదవండి: CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం