బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ , ఆయన తల్లి మేనకాగాంధీని తొలగించారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా గత కొంతకాలంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు వరుణ్‌గాంధీ. ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరి హింసాకాండపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవాళ కూడా హత్యలతో నోళ్లు మూయించలేరు అంటూ ట్వీట్ చేశారు వరుణ్‌గాంధీ. వరుణ్‌గాంధీతో పాటు మేనకాగాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎంపీలుగా బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొత్తగా జ్యోతిరాధిత్యా సింధియాకు , నటుడు మిథున్ చక్రవర్తికి చోటు లభించింది.
తీవ్ర చర్చనీయాంశమైన వరుణ్ గాంధీ ట్వీట్
రోడ్డుపై ప్రదర్శనగా వెళ్తున్న రైతులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్న వీడియోను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం గురువారం ట్వీట్ చేశారు. ‘ఈ వీడియో క్లారిటీగా ఉంది. హత్యల ద్వారా నిరసనకారుల నోరు మూయించలేం. చిందిన అమాయక రైతుల రక్తానికి సమాధానం అవసరం. రైతుల మనస్సుల్లో అహంకారం, క్రూరత్వం మొలకెత్తక ముందే న్యాయం చెయ్యాలి’ అని ఆయన పేర్కొన్నారు.
The video is crystal clear. Protestors cannot be silenced through murder. There has to be accountability for the innocent blood of farmers that has been spilled and justice must be delivered before a message of arrogance and cruelty enters the minds of every farmer. ???? pic.twitter.com/Z6NLCfuujK
— Varun Gandhi (@varungandhi80) October 7, 2021
రెండు రోజుల క్రితం కూడ వరుణ్ గాంధీ ఇదే తరహా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ‘ఈ దృశ్యాలు ఎవరి మనసునైనా కదిలిస్తాయ’ని రాసుకొచ్చారు. వీడియో ఆధారంగా వాహనాల ఓనర్స్, అందులో కూర్చున్న వ్యక్తులు, ఘటనతో సంబంధం ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను కోరారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఇటీవల రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్‌తో దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం జరిగిన ఘటనల్లో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలను రేకెత్తించింది.
Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి