మరో ఆరు నెలల్లో దీదీ సర్కార్ డౌన్…

టీఎంసీ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో పడిపోనుందని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. దీదీ సర్కార్ 2021 వరకు కొనసాగలేదని.. ఆరు నెలల నుంచి ఏడాది లోపు కూలిపోవడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం మమత ప్రభుత్వం.. పోలీసులు, సీఐడీ అధికారుల సహాయంతో నడుస్తోందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా విఫలమైందని అన్నారు. ఫలితాల తర్వాత ఆ పార్టీ నాయకులు హింసను సృష్టిస్తున్నారని తెలిపారు. టీఎంసీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు […]

మరో ఆరు నెలల్లో దీదీ సర్కార్ డౌన్...
Follow us

| Edited By:

Updated on: May 29, 2019 | 1:19 PM

టీఎంసీ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో పడిపోనుందని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. దీదీ సర్కార్ 2021 వరకు కొనసాగలేదని.. ఆరు నెలల నుంచి ఏడాది లోపు కూలిపోవడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం మమత ప్రభుత్వం.. పోలీసులు, సీఐడీ అధికారుల సహాయంతో నడుస్తోందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా విఫలమైందని అన్నారు. ఫలితాల తర్వాత ఆ పార్టీ నాయకులు హింసను సృష్టిస్తున్నారని తెలిపారు. టీఎంసీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

ముకుల్‌రాయ్ కుమారుడు సుభ్రాంగ్‌షురాయ్‌తోపాటు మరో శాసనసభ్యుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సైతం కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరుతారని ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రధాని నరేంద్రమోదీ.. టీఎంసీ అధినాయకురాలు మమతను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. లోక్‌సభ ఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సుభ్రాంగ్‌షురాయ్‌ను టీఎంసీ సస్పెండ్ చేసింది.