AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేనల్లుడి కోసమే వెళ్తున్న మమత

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతకు మోదీ ఆహ్వానం పంపారు. రాజకీయంగా తమ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు మమత సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మమత టూర్‌పై వెస్ట్ బెంగాల్‌లోని బర్రాక్పూర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన అర్జున్ […]

మేనల్లుడి కోసమే వెళ్తున్న మమత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2019 | 1:05 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతకు మోదీ ఆహ్వానం పంపారు. రాజకీయంగా తమ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు మమత సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో మమత టూర్‌పై వెస్ట్ బెంగాల్‌లోని బర్రాక్పూర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన అర్జున్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత తన మేనల్లుడిని కాపాడుకునేందుకే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్నారని విమర్శించారు. ఏలాగైన మోదీని ప్రాధేయపడి ఇబ్బందుల నుంచి గట్టేక్కించమనడానికే వెళ్తోందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని లేపాయి.

Follow Us