ముహూర్తం గురువారం సాయంత్రం 6. 40 గంటలకు..ఫిక్స్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే గురువారం సాయంత్రం 6. 40 గంటలకు ముంబై దాదర్ లోని శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సీఎంగా ఈ రాష్ట్ర సారథి అవుతానని తాను కలలో నైనా ఊహించలేదని ఉధ్ధవ్ థాక్రే.. ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఇందుకు ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, ఇతరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ఉదయం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సుమారు […]

ముహూర్తం గురువారం సాయంత్రం 6. 40 గంటలకు..ఫిక్స్
Follow us

|

Updated on: Nov 27, 2019 | 12:12 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే గురువారం సాయంత్రం 6. 40 గంటలకు ముంబై దాదర్ లోని శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సీఎంగా ఈ రాష్ట్ర సారథి అవుతానని తాను కలలో నైనా ఊహించలేదని ఉధ్ధవ్ థాక్రే.. ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఇందుకు ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, ఇతరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ఉదయం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సుమారు 40 నిముషాల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉధ్ధవ్ భార్య రష్మి కూడా ఆయన వెంట ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెమ్ స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ ప్రమాణం చేయించేశారు గనుక ఇక ఈ సాయంత్రం ఉధ్ధవ్ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవలసి ఉంటుంది. ఇక అజిత్ పవార్ కూడా మళ్ళీ ఎన్సీపీ గూటికి చేరిపోయిన నేపథ్యంలో ఈ కూటమికి ఎలాంటి చింత ఉండదని భావిస్తున్నారు. నిజానికి అజిత్ ను శరద్ పవార్ మంగళవారం మధ్యాహ్నమే తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నేత ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకోలేని స్థితిలో ఉన్నారని, అనవసరంగా ఆయనతో చేతులు కలిపే బదులు తిరిగి ‘ మన ‘ పార్టీలోకి రావాలని శరద్ పవార్ నచ్ఛజెప్పినట్టు సమాచారం, పైగా సుప్రియా సూలే కూడా మన కుటుంబంలో చీలికలెందుకని, అంతా కలిసి ఉందామని మొదటినుంచీ ఆయనకు ‘ హితవు ‘ పలుకుతూనే ఉంది. బహుశా ‘ ఫ్యామిలీ పాలిటిక్స్ ‘ లో అంతా ‘ ఒక్కటి కావడానికి ‘ ఇది కూడా దోహదపడిఉండవచ్ఛు. ఇదిలా ఉండగా.. 14 వ మహారాష్ట్ర శాసన సభ బుధవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమై అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రభుత్వం ఏర్పాటు కాకుండానే, ఒక ముఖ్యమంత్రి నియామకం జరగకముందే సభ సమావేశం కావడం విశేషం. గత రెండు దశాబ్దాలుగా మొదట సీఎం, ఆ తరువాత ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారని, కానీ సభ ఇలా భేటీ కావడం ఇదే మొదటిసారని అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ పేర్కొన్నారు. వారి ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే బలపరీక్ష జరిగేదని, లేదా ఆ తరువాత నిర్వహించే సమావేశంలో ఈ కార్యక్రమం ఉండేదన్నారు. ఈ సారి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందని, ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎంగానీ, కేబినెట్ గానీ లేకుండానే అసెంబ్లీ ‘సుషుప్తావస్థ ‘ నుంచి బయటకు వఛ్చినట్టయిందని రాజేంద్ర భగవత్ పేర్కొన్నారు. కాగా-. ఈ ఉదయం మొదట ప్రమాణ స్వీకారం చేసిన వారిలో అజిత్ పవార్, ఛగన్ భుజ్ బల్, అశోక్ చవాన్, పృథ్వీ రాజ్ చవాన్ ఉన్నారు.