జగన్ కూడా మనతో వస్తారు- కేటీఆర్

జగన్ కూడా మనతో వస్తారు- కేటీఆర్

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న 16 పార్లమెంట్ స్థానాల్లో..టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కేసీఆర్ వాటిని 160 చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన కేటీఆర్…బీజేపీ, కాంగ్రెస్‌ల నిరంకుశ ధోరణిని వ్యతిరేకించే చాలా పార్టీలు దేశంలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతి, అఖిలేష్‌యాదవ్ లాంటి నేతలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ప్రత్యామ్నాయ నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు.  […]

Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Mar 27, 2019 | 4:18 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న 16 పార్లమెంట్ స్థానాల్లో..టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కేసీఆర్ వాటిని 160 చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన కేటీఆర్…బీజేపీ, కాంగ్రెస్‌ల నిరంకుశ ధోరణిని వ్యతిరేకించే చాలా పార్టీలు దేశంలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతి, అఖిలేష్‌యాదవ్ లాంటి నేతలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ప్రత్యామ్నాయ నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు.  ఈ సందర్భంగా  ఏపీలో జగన్‌మోహన్ రెడ్డి సైతం ఇదే ఉద్దేశంతో ఉన్నారన్నారు.  ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్… 16 మంది ఎంపీలతో  ఏం చేయగలరో అంచనా వేయాలన్నారు. సారు-కారు-పదహారు-ఢిల్లీలో సర్కార్ ఇదే అందరి నినాదం కావాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu