AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా జిల్లా గూడూరులో పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్పీ.. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్న రవీంద్రనాథ్‌ బాబు

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కృష్ణాజిల్లా గూడూరు మండల పరిధిలోని పలు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక..

కృష్ణా జిల్లా గూడూరులో పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్పీ.. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్న రవీంద్రనాథ్‌ బాబు
K Sammaiah
|

Updated on: Feb 17, 2021 | 12:38 PM

Share

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కృష్ణాజిల్లా గూడూరు మండల పరిధిలోని పలు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గూడూరు, గూడూరు మండల పరిధిలోని కప్పలదొడ్డి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయని అన్నారు. ముందస్తుగా అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు ఏర్పాట్లను తీసుకోవడం జరిగిందని తెలిపారు. 3000 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు కోసం నియమించడం జరిగిందని, ఇందులో 107 సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లు,130 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల ను గుర్తించడం జరిగిందని తెలిపారు.

ఎటువంటి రవాణా సౌకర్యాలు లేని నాగాయలంక మండల పరిధిలోని ఎదురుమొండి, నాచుగుంట కేంద్రాలలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, సిఐలు కొండయ్య, అంకబాబు, ఎస్సై దుర్గా ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Rea more:

శారదాపీఠాన్ని సందర్శించిన సీఎం జగన్‌.. వార్షిక మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఏపీ సీఎం

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..