CM Dalit Empowerment Scheme : “సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్” విధివిధానాల రూపకల్పనపై నేడు కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్

ఈ రోజు ఉ. 11:30కి సీఎం కేసీఆర్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో "సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్" విధివిధానాల రూపకల్పనపై..

CM Dalit Empowerment Scheme : సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్ విధివిధానాల రూపకల్పనపై నేడు కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్
CM KCR
Follow us

|

Updated on: Jun 27, 2021 | 9:39 AM

CM KCR all – party meeting : ఈ రోజు ఉ. 11:30 కి సీఎం కేసీఆర్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో  “సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్”  విధివిధానాల రూపకల్పనపై చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో అన్నిపార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో పాటు సీఎస్‌, సీఎంవో అధికారులు పాల్గొనబోతున్నారు.

అయితే, ఈ సమావేశానికి రావాలంటూ వామపక్షనేతలు చాడా వెంకట్‌రెడ్డి, తమ్మినేనికి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానం పంపారు. ప్రగతి భవన్ జరుగబోతోన్న దళితుల సాధికారత స్కీం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ అల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది.

తెలంగాణలోని అన్ని పార్టీల దళితల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరిన ఈ సమావేశానికి బీజేపీ దూరం జరిగింది. ఇక, ఈ సమావేశంలో తెలంగాణలో దళితల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై అన్ని పార్టీల నాయకులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ ఏడాది దళితుల అభివృద్ధి కోసం 1,000 కోట్లు ఏ విధంగా ఖర్చు చేయాలని అన్నదానిపై అభిప్రాయ సేకరణ జరుపుతారు సీఎం కేసీఆర్.

దలిత్ ఎంపవరమెంట్ పథకం కింద 8 ల‌క్ష‌ల ద‌ళిత బీపీఎల్ కుటుంబాల అభివృద్ధే ల‌క్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో ముందుకు సాగుతోంది. ప్రతి ఏటా కొంతమంది లబ్ధిదారులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, రైతుబంధు, వృద్ధాప్య పింఛ‌న్లు అందుతున్న పద్ధతుల్లోనే పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమయ్యేటట్లుగా కార్యాచరణ రూపొందించాలని సర్కారు భావిస్తోంది.

Read also : Dog dispute : కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని చంపింది.