AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌కు కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తామని జనసేన, బీఎస్పీ పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన, బీఎస్పీ పొత్తుపై టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు సూటి ప్రశ్న వేశారు. మాయావతి పార్టీతో జత కట్టి పోటీ చేస్తానంటున్న పవన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తారా? అని అడిగారు. దీనికి పవన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పవన్, మాయావతి సమాధానం చెప్పాలని అన్నారు. […]

పవన్‌కు కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న
Vijay K
|

Updated on: Mar 15, 2019 | 5:42 PM

Share

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తామని జనసేన, బీఎస్పీ పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన, బీఎస్పీ పొత్తుపై టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు సూటి ప్రశ్న వేశారు. మాయావతి పార్టీతో జత కట్టి పోటీ చేస్తానంటున్న పవన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తారా? అని అడిగారు.

దీనికి పవన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పవన్, మాయావతి సమాధానం చెప్పాలని అన్నారు. అంతకుముందు రోజు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దండం పెట్టి అడుగుతున్నాను ఏపీని కేసీఆర్ వదిలిపెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us