కల్లూరులో టెన్షన్.. టెన్షన్.. ఏకగ్రీవంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడి
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకునేందుకు
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక ఎన్నికలు లేకుండానే పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు అటు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ చెక్ పెట్టే పనిలో పడింది.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కైకలూరు మండలం శృంగవరప్పాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల అంశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని ఓ వర్గం పట్టు పడుతుండగా పోటీ జరగాల్సిందేనని మరోవర్గం పట్టు పుడుతుంది ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకుంది.
మాటల దాడి దాటి కర్రల దాడి వరకు వచ్చింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.